దుర్గగుడి పాలకమండలి సభ్యురాలి కారులో అక్రమమద్యం
BY Telugu Gateway30 Sept 2020 6:55 PM IST
X
Telugu Gateway30 Sept 2020 6:55 PM IST
విజయవాడ కనకదుర్గ దేవాలయం పాలకమండలి సభ్యురాలి కారులో అక్రమ మద్యం కలకలం రేపుతోంది. ఈ కారుకు దేవాలయం పాలక మండలి సభ్యురాలు అన్న బోర్డు కూడా ఉంది. ఏపీ16 బీవీ 5577లో స్విఫ్ట్ ఈ మద్యం పట్టుపడింది. దీని విలువ సుమారు 40 వేల రూపాయల వరకూ ఉంటుందని అంచనా వేశారు.
పోలీసులు కేసు నమోదు విచారణ ప్రారంభించారు. దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు వెంకటనాగ వరలక్ష్మి కారులో ఈ మద్యం బాటిళ్లను 'స్వాధీనం చేసుకున్నారు. సీతారాంపురంలోని ఓ అపార్ట్ మెంట్‌లో పార్క్ చేసిన కారులో మద్యం స్వాధీనం చేసుకున్నారు.
Next Story