Telugu Gateway
Top Stories

దుమ్మురేపిన జొమాటో

దుమ్మురేపిన జొమాటో
X

స్టాక్ మార్కెట్లో ప్ర‌స్తుతం ప‌బ్లిక్ ఇష్యూ వచ్చింది అంటే చాలు మ‌దుప‌రులు పెట్టుబ‌డులు పెట్టేందుకు ఎగ‌ప‌డుతున్నారు. కొంత కాలం అయితే కార్పొరేట్లు ఐపీవో పేరేత్త‌టానికే భ‌య‌ప‌డ్డారు. ఇప్పుడు రివ‌ర్స్ ట్రెండ్ న‌డుస్తోంది. ఇష్యూ వ‌చ్చింది అంటే చాలు డ‌బ్బు గుమ్మ‌రించ‌టానికి అంద‌రూ రెడీ అయిపోతున్నారు. కాస్త పేరున్న కంపెనీ అయితే ఇక ఊహించ‌ని స్థాయిలో స్పంద‌న వ‌స్తోంది. అందుకు తాజా నిద‌ర్శ‌న‌మే జొమాటో ప‌బ్లిక్ ఇష్యూ. ఈ ఆన్ లైన్ ఆహార స‌ర‌ఫ‌రా సంస్థ‌కు అనూహ్య స్పంద‌న ద‌క్కింది. ఇదే ఊపుతో రాబోయే రోజుల్లో మ‌రిన్ని కంపెనీలు కూడా క్యూక‌ట్టే అవ‌కాశం ఉంద‌ని మార్కెట్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి.

9375 కోట్ల రూపాయ‌ల సేక‌ర‌ణ కోసం జొమాటో స్టాక్ మార్కెట్లోకి ప్ర‌వేశించ‌గా..శుక్ర‌వారం సాయంత్రానికి అంటే గ‌డువు ముగిసే ఐదు గంట‌ల నాటికి 40 రెట్లు ఒవ‌ర్ సబ్ స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్ట‌ర్ల కోసం కేటాయించిన విభాగంలో 7.87 రెట్లు ఒవ‌ర్ సబ్ స్క్రైబ్ కాగా, సంస్థాగ‌త పెట్టుబ‌డిదారుల విబాగం 34.80 రెట్లు స‌బ్ స్క్రైబ్ కాగా, అర్హ‌త గ‌ల సంస్థాగ‌త పెట్టుబ‌డిదారుల విభాగం 54.71 రెట్లు స‌బ్ స్క్రైబ్ అయింది. ఉద్యోగుల‌ విభాగంలో అత్యంత త‌క్కువ‌గా 0.62 రెట్లు మాత్ర‌మే స‌బ్ స్క్రైబ్ అయింది. 2021 సంవ‌త్స‌రంలో టాప్ టెన్ స‌బ్ స్క్రైబ్ అయిన ఐపీవోల్లో జొమాటో ఒక‌టిగా నిలిచింది.

Next Story
Share it