Telugu Gateway
Top Stories

జొమాటో షేర్లలో భారీ ర్యాలీ

జొమాటో షేర్లలో భారీ ర్యాలీ
X

జొమాటో షేర్లు గత ఏడాది కాలంలో దుమ్ము రేపాయి. దీంతో అటు ఇన్వెస్టర్లతో పాటు ప్రమోటర్ కు లాభాలు పంట పండింది. జొమాటో వ్యవస్థాపకుడు అయిన 41 సంవత్సరాల దీపేందర్ గోయల్ ఇప్పుడు బిలియనీర్ అయ్యారు. జొమోటో షేర్లలో చోటు చేసుకున్న ర్యాలీ తో దీపేందర్ నికర విలువ 8300 కోట్ల రూపాయలను దాటింది. 2023 జులై నాటి నుంచి కంపెనీ షేర్ కనిష్ట ధరతో పోలిస్తే జొమాటో షేర్లు 300 శాతం మేర పెరిగాయి. సోమవారం నాడు ఈ షేర్ 52 వారాల గరిష్ట స్థాయి 232 రూపాయలకు చేరింది.

చివరకు ఏడు రూపాయల లాభంతో 229 రూపాయల వద్ద ముగిసింది. దీంతో ప్రమోటర్ బిలియనీర్ గా మారిపోయారు. గత కొంత కాలంగా భారతీయ స్టాక్ మార్కెట్ లు బ్రేకులు లేకుండా దూసుకువెళుతున్న విషయం తెలిసిందే. ఒక బహుళ జాతి కంపెనీలో చేస్తున్న ఉద్యోగానికి గుడ్ బై చెప్పిన దీపేందర్ గోయల్ 2008 సంవత్సరంలో ఫుడ్ డెలివరీ ఫ్లాట్ ఫార్మ్ జొమాటో ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఈ కంపెనీ ద్వారా ఆయన బిలియనీర్ల క్లబ్ లో చేరారు.

Next Story
Share it