Telugu Gateway
Top Stories

జాగెల్‌ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీస్ ఐపీఓ

జాగెల్‌ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీస్ ఐపీఓ
X

ప్రపంచ శ్రేణి ఆర్థిక సేవలు,,ఉత్పత్తుల కంపెనీ జాగెల్‌ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీస్ స్టాక్ మార్కెట్ లోకి ప్రవేశిస్తోంది.ఈ సంస్థ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) సెప్టెంబర్ 14, 2023న స్టార్ట్ అయి..18 న ముగియనుంది. ఒక్కొక్కటి ₹ 1 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేరుకు ప్రైస్ బ్యాండ్ ₹ 156 నుండి ₹ 164 గా నిర్ణయించారు. ఈ ఆఫర్ కింద కనిష్టంగా 90 ఈక్విటీ షేర్లు, ఆ తర్వాత 90 ఈక్విటీ షేర్ల గుణిజాలలో బిడ్లు వేయవచ్చు.ఈ ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌ లో భాగంగా ₹ 3,920 మిలియన్ల విలువ కలిగిన ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ మరియు 10,449,816 ఈక్విటీ షేర్లను “ఆఫర్ ఫర్ సేల్” గా సెల్లింగ్ షేర్ హోల్డర్స్ అందుబాటులో ఉంచనున్నారు.

ఈ ఆఫర్ ద్వారా సమకూరిన మొత్తాలలో కస్టమర్ సముపార్జన మరియు నిలుపుదల కోసం ₹ 3,000 మిలియన్ల ను ఉపయోగించాలని కంపెనీ ప్రతిపాదిస్తోంది; సాంకేతికత మరియు ఉత్పత్తుల అభివృద్ధికి ₹ 400 మిలియన్ల వ్యయం చేయటంతో పాటుగా ; కంపెనీ ద్వారా పొందబడిన ₹170.83 మిలియన్ల మొత్తం లేదా పాక్షికంగా నిర్దిష్ట రుణాల చెల్లింపు లేదా ముందస్తు చెల్లింపు మిగిలిన మొత్తాలను సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం వినియోగించనున్నారు.

Next Story
Share it