Telugu Gateway
Top Stories

ప్ర‌పంచ అత్యుత్త‌మ నివాసయోగ్య న‌గ‌రాలు ఇవే

ప్ర‌పంచ అత్యుత్త‌మ నివాసయోగ్య న‌గ‌రాలు ఇవే
X

టాప్ టెన్ న‌గ‌రాలు. దేశంలోనే కాదు..ప్ర‌పంచ వ్యాప్తంగా ఇవే బెస్ట్ అంటూ ఓ నివేదిక వెల్ల‌డైంది. విచిత్రం ఏమిటంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఈ జాబితా కోసం ప‌ది న‌గ‌రాల‌ను ఎంపిక చేస్తే అందులో మూడు న‌గ‌రాలు ఏకంగా కెన‌డాకు చెందినవి ఉండ‌టం విశేషం. తాజా జాబితా ప్ర‌కారం ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ నివాస న‌గ‌రంగా ఆస్ట్రియా రాజ‌ధాని వియ‌న్నా నిలిచింది. దాని త‌ర్వాత రెండ‌వ స్థానంలో డెన్మార్క్ కు చెందిన కోపెన్ హెగెన్, స్విట్జ‌ర్లాండ్ కు చెందిన జ్యూరిక్, కెన‌డాకు చెందిన కేల‌గ్రే, వాంకోవ‌ర్, స్విట్జ‌ర్లాండ్ కు చెందిన జెనీవా, జ‌ర్మ‌నీకి చెందిన ఫ్రాంక్ ఫర్ట్, కెనడాకే చెందిన టొరంటో, నెద‌ర్లాండ్స్ కు చెందిన అమెస్ట‌ర్ డామ్, జ‌పాన్ కు చెందిన ఒకాసా, ఆస్ట్రేలియాకు చెందిన మెల్ బోర్న్ లు వ‌ర‌స‌గా టాప్ టెన్ లో చోటు సంపాదించుకున్నాయి. ఎకాన‌మిస్ట్ ఇంటెలిజెంట్ యూనిట్ తాజాగా ఈ వివ‌రాలను వెల్ల‌డించింది. స్థిర‌త్వం, మంచి మౌలిక‌స‌దుపాయాలు, మంచి వైద్య ఆరోగ్య సేవ‌లు, వినోద రంగానికి చెందిన అంశాలను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని వియ‌న్నాను ఎంపిక చేశారు. ఫ్రాన్స్ రాజ‌ధాని పారిస్ 19 వ స్థానంలో ఉంది. యునైటెడ్ కింగ్ డ‌మ్ రాజ‌ధాని లండ‌న్ ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ నివాస న‌గ‌రాల్లో 33వ స్థానంలో ఉంది.

Next Story
Share it