Telugu Gateway
Top Stories

ప్రపంచంలో టాప్ టెన్ ఖరీదైన నగరాలేవో తెలుసా?

ప్రపంచంలో టాప్ టెన్ ఖరీదైన నగరాలేవో తెలుసా?
X

సహజంగా నగరాల్లో జీవించాలంటే చాలా ఎక్కువ డబ్బులు కావాలి. కానీ ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో నివసించాలంటే అది కేవలం సంపన్నులకు మాత్రమే సాధ్యం అవుతుంది. జూలియస్ బేర్ గ్లోబల్ వెల్త్ అండ్ లైఫ్ స్టైల్ రిపోర్ట్ 2021 దీనికి సంబంధించిన పలు అంశాలను బహిర్గతం చేసింది. తాజాగా సంపన్నులు నివసించే అత్యంత ఖరీదైన నగరాల జాబితాలో ఇప్పుడు షాంఘై మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత స్థానాల్లో టోక్యో, హాంకాంగ్, మోనాకో, తాపై, జ్యూరిక్, ప్యారిస్, లండన్, సింగపూర్, న్యూయార్క్ వంటి దేశాలు ఉన్నాయి.

ప్రపంచంలోనే భూమి మీద అత్యంత ఖరీదైన నగరాలు ఎక్కువ ఆసియాలోనే ఉన్నాయి. ఈ జాబితాలో దేశంలోని ప్రముఖ ఆర్ధిక కేంద్రం అయిన ముంబయ్ కి 22 వ స్థానం దక్కింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగరంగా హాంకాంగ్ ఉండేది. ఆ స్థానాన్ని ఇప్పుడు షాంఘై దక్కించుకుంది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే కరోనా మహమ్మారి కారణంగా అమెరికా, కెనడాల డాలర్ల విలువ తగ్గటంతో ఈ దేశాలు చాలా అమోదయోగ్యమైన ప్రాంతాలుగా మారాయని తెలిపారు.

Next Story
Share it