ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఎక్కడ ఉన్నదో తెలుసా?. దేశ ఆర్థిక రాజధాని ముంబయ్ లో. ముకేశ్ అంబానీకి చెందిన జియో వరల్డ్ సెంటర్ లో దీన్ని ఏర్పాటు చేశారు. ఈ భవనంలోనే నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ కు వెళ్లే మార్గంలో ఇది ఉంటుంది. ప్రముఖ సంస్థ కోన్ ఈ లిఫ్ట్ ను ఏర్పాటు చేసింది. ఇందులో ఒకే సారి 235 మంది ప్రయాణించే వీలు ఉంటుంది. రెండు వైపులా ఇందులో సోఫా లు కూడా వేశారు. ఈ లిఫ్ట్ ను చూస్తే ఒక పెద్ద హాల్ ను చూసిన ఫీలింగ్ కలుగుతుంది. ఆ లిఫ్ట్ ముందే అధికారికంగా ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ అని రాసి ఉంటుంది. ముంబయ్ లో ఇప్పుడు ఇది ఒక ఆసక్తికర అంశంగా ఉంది అనటంలో అతిశయోక్తి లేదు. నీతా ముకేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ను దేశీయ కళలు, సంస్కృతులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేశారు. ఇందులో వివిధ రకాల కార్యక్రమాల కోసం అతి పెద్ద థియేటర్ కూడా ఉంది.