ప్రపంచ టాప్ 20 యూనివర్శిటీల్లో తొమ్మిది అమెరికాలోనే!
అగ్రశ్రేణి యూనివర్శిటీలు అన్నీ అమెరికాలోనే ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 20 టాప్ యూనివర్శిటీలను ఎంపిక చేస్తే అందులో ఏకంగా తొమ్మిది యూనివర్శిటీలు అగ్రరాజ్యం అమెరికాలోనే ఉన్నాయి. క్యూఎస్ ప్రపంచ యూనివర్శిటీ ర్యాంకింగ్స్ 2023ను తాజాగా విడుదల చేశారు. వరసగా పదకొండవ సంవత్సరం కూడా అమెరికాకు చెందిన మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ఇది అమెరికాలోనే ఉంటుందనే విషయం తెలిసిందే. యూకెకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ ప్రపంచ వ్యాప్తంగా రెండవ స్థానంలో ఉంది. అమెరికాకే చెందిన స్టాన్ ఫోర్డ్ యూనివర్శిటీ మూడవ స్థానంలో ఉండగా..యూనివర్శిటీ ఆఫ్ ఆక్స్ ఫర్డ్ (యూకె) నాలగవ స్థానంలో, హార్వర్డ్ యూనివర్శిటీ (యూఎస్) ఐదవ స్థానంలో, కాల్టెక్ (యూస్) ఆరవ స్థానంలో ఉంది.
ఇంపీరియల్ కాలేజ్ లండన్ (యూకె), ఏడవ స్థానంలోయూసీఎస్ (యూకె) ఎనిమిదవ స్థానంలో, ఈటీహెచ్ జ్యూరిచ్ (స్విట్జర్లాండ్) ఎనిమిదవ స్థానంలో, యూనివర్శిటీ ఆఫ్ చికాగో( యూఎస్) పదవ స్థానంలో ఉన్నాయి. నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ సింగపూర్ (సింగపూర్),పెర్కింగ్ యూనివర్శిటీ (చైనా), యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియా (యూఎస్), సింగుహా యూనివర్శిటీ (చైనా), యూనివర్శిటీ ఆప్ ఎడెన్ బర్గ్ (యూకె), ఈపీఎఫ్ ఎల్ (స్విట్జర్లండ్), ప్రిన్సిస్టన్ యూనివర్శిటీ (యూఎస్), యాలే యూనివర్శిటీ (యూఎస్),నాన్ యాంగ్ టెక్నాలజీకల్ యూనివర్శిటీ (సింగపూర్), కార్మెల్ యూనివర్శిటీ (యూఎస్ లు) వరసగా పదకొండు నుంచి ఇరవయ్యో స్థానంలో నిలిచాయి.