Telugu Gateway
Top Stories

ప్రపంచం లోనే సెకండ్ స్లో సిటీ బెంగళూరు

ప్రపంచం లోనే సెకండ్ స్లో సిటీ బెంగళూరు
X

భారత దేశ ఐటి రాజధాని బెంగళూరు లో ట్రాఫిక్ సమస్య గురించి అందరికి తెలిసిందే. కానీ అది మరి ఇంతలా ఉంటుంది అని...ఏకంగా ప్రపంచంలోనే రెండవ స్లో సిటీగా నిలుస్తుంది అని ఎవరూ ఉహించి ఉండరు. ఈ జాబితా లో ఫస్ట్ ప్లేస్ లండన్ కు దక్కితే...సెకండ్ ప్లేస్ లో బెంగళూరు నిలిచింది . ఇది ఎందులో అంటారా ట్రాఫిక్ కదలికల విషయంలో. ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన స్టడీ ప్రకారం ఈ ర్యాంక్ లు ఇచ్చారు. లండన్ నగరంలో పది కిలోమీటర్ల ప్రయాణానికి పట్టే సగటు సమయం 36 నిమిషాల.20 సెకన్లు. అదే బెంగళూరు లో అయితే అదే పది కిలోమీటర్లకు 29 నిమిషాల పది సెకన్లు పడుతుంది. దేశ ఐటి రాజధానిలో సంవత్సరానికి రద్దీ సమయాల్లో 260 గంటల సమయం వృధా అవుతుంది అని తేల్చారు.

డచ్ కు చెందిన టామ్ టామ్ సంస్థ ఈ నివేదిక సిద్ధం చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 56 దేశాల్లోని 389 నగరాలకు సంబదించిన నివేదిక సిద్ధం చేశారు. ఇదే జాబితాలో భారత్ కు చెందిన పలు నగరాలు ఉన్నాయి. ఇందులో బెంగళూరు ప్రపంచంలోనే సెకండ్ ప్లేస్ దక్కించుకోగా...మహారాష్ట్ర కు చెందిన పూణే ఆరవ ప్లేస్ లో. ముంబై 47 వ ప్లేస్ లో ఉన్నాయి. టాప్ టెన్ జాబితాలో మూడవ ప్లేస్ లో డబ్లిన్, నాల్గవ ప్లేస్ సప్పారో, మిలాన్ ఐదవ స్థానంలో , బుకారెస్ట్ ఏడు,లిమా ఎనిమిది, మనీలా తొమ్మిది, బొగొటా పదవ స్థానాల్లో ఉన్నాయి.

Next Story
Share it