Telugu Gateway
Top Stories

రెండేళ్ళలో మాంద్యంలోకి ప్రపంచం!

రెండేళ్ళలో మాంద్యంలోకి ప్రపంచం!
X

ఓ వైపు కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడు కోలుకుంటున్న ప్రపంచానికి రష్యా-ఉక్రెయిన్ ల మధ్య సాగుతున్న యద్ధం మరో ప్రమాదంలోకి నెట్టింది. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే రెండేళ్లలో ప్రపంచం మాంద్యంలోకి వెళ్ళే ప్రమాదం ఉందని సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ సంచల వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రభావాన్ని సింగపూర్ ప్రజలు చవిచూస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. అధిక ఇంథన ధరలు కారణంగా సింగపూర్ లో జీవన వ్యయం పెరిగిందని తెలిపారు. ఇది రాబోయే రోజుల్లో కూడా మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ భవిష్యత్ లో ఎదురయ్యే ఆర్ధిక సవాళ్ళకు సిద్ధం కావాల్సిందేనని హెచ్చరించారు.

భారత్ లో కూడా ద్రవ్యోల్భణం ఎన్నడూలేని రీతిలో గరిష్ట స్థాయికి చేరి సామాన్యులను తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోంది. రష్యా ప్రారంభించిన యుద్ధం కారణంగా దేశ వ్యాప్తంగా స్టీల్, సిమెంట్ ధరలు అసాధారణంగా పెరిగిపోవటం అత్యంత కీలకమైన నిర్మాణ రంగం తీవ్ర సమస్యలు ఎదుర్కొంటోంది. దేశంలో ఉపాధి కల్పనలతో ఈ రంగానిది రెండవ స్థానం. ఇంతటి కీలక రంగంపై ధరల పెరుగుదల ప్రభావం ఉండటంతో నిరుద్యోగ సమస్య పెరిగే అవకాశం ఉందనేఏ ఆందోళన వ్యక్తం అవుతోంది.



Next Story
Share it