Telugu Gateway
Top Stories

'ఎగిరే బైకులొస్తున్నాయి'..ఇక ఆకాశంలోనూ బైక్ రేస్ లు!

ఎగిరే బైకులొస్తున్నాయి..ఇక ఆకాశంలోనూ బైక్ రేస్ లు!
X

ప్ర‌పంచంలోనే తొలి ఎగిరే బైక్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే ఎగిరే కార్ల మోడ‌ల్స్ చాలా కాలం క్రిత‌మే బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఇప్పుడు ఎగిరే బైక్ వ‌చ్చింది. అమెరికాలో జ‌రిగిన ఓ ఆటో షోలో దీన్ని ప్ర‌ద‌ర్శించారు. ఇది చూసిన వారంతా ఆశ్చ‌ర్య‌పోయార‌నే చెప్పొచ్చు. అయితే ఈ ధ‌ర చూస్తే ఆశ్చ‌ర్యం కాదు..అవాక్కు అవ్వాల్సిందే. ఎందుకంటే ఈ ఎగిరే బైక్ ధ‌ర ఏకంగా 6.18 కోట్ల రూపాయ‌లు ఉంటుంద‌ట. ఈ ఎగిరే బైక్ వ‌చ్చే ఏడాది అమెరికా మార్కెట్లో అందుబాటులోకి రానుంది. ఈ బైక్ ను జ‌పాన్ కు చెందిన స్టార్ట‌ప్ కంపెనీ ఏర్ క్విన్స్ ఈ హోవ‌ర్ బైక్ ఎక్స్ టుర్సిమోను త‌యారు చేసింది. ఈ బైక్ ఒకేసారి న‌ల‌భై నిమిషాల పాటు ఏక‌ధాటిగా ప్ర‌యాణించ‌గ‌ల‌దు. గంట‌కు 62 కిలోమీట‌ర్ల వేగంతో వెళ్ల‌గ‌ల‌దు. ఈ బైక్ ను చూసిన చాలా మంది సంభ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గుర‌వుతున్నారు.

Next Story
Share it