Telugu Gateway
Top Stories

వైల్డ్ లైఫ్ నుంచి వ‌చ్చిందే 'వైఫ్‌'!

వైల్డ్ లైఫ్ నుంచి వ‌చ్చిందే వైఫ్‌!
X

ఆర్ పీజీ ఎంట‌ర్ ప్రైజెస్ అధినేత హ‌ర్ష్ గోయెంకా ఈ మ‌ధ్య వివాద‌స్ప‌ద ట్వీట్ల‌తో చిక్కుల్లో ప‌డుతున్నారు. తాజాగా ఆయ‌న చేసిన ట్వీట్ ఒక‌టి దుమారం రేపుతోంది. ఈ ట్వీట్ పై వివాద‌స్ప‌ద వ్యాఖ్య‌లు వ‌స్తుండ‌టంతో ఆయ‌న దీన్ని చివ‌ర‌కు డిలీట్ చేయాల్సి వ‌చ్చింది. అస‌లు విష‌యం ఏమిటంటే... 'నేను స్వామి హ‌ర్షానంద్ ను అడిగా..ఈ వైఫ్ అనే ప‌దం ఎక్క‌డ నుంచి వ‌చ్చింద‌ని. వైల్డ్ లైఫ్ లోని మొద‌టి రెండు అక్షరాలు..చివ‌రి రెండు అక్షరాలు క‌లిపితే వ‌చ్చింద‌న్నారు. ఇది గురుపూర్ణిమ స‌ల‌హా అంటూ ముగించారు'. దీంతో నెటిజన్లు ఈ ట్వీట్ పై హ‌ర్ష్ గోయెంకాతో ఆడుకున్నారు. నీల్ గ్రోవెర్ అనే ట్విట్ట‌ర్ యూజ‌ర్ ను గోయెంకా నీగ్రో అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు..ఆయ‌న‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగి త‌ర్వాత త‌న ట్వీట్ డిలీట్ చేశారు.

గ‌తంలోనూ ఆయ‌న చాలా వివాద‌స్ప‌ద ట్వీట్లు చేశారు. కొద్ది రోజుల క్రితం మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ విడాకుల‌పైనే స్పందించారు. విడాకులు తీసుకున్న ప్ర‌పంచంలోని సంపన్నులైన జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ భార్య‌ల‌కు భ‌ర‌ణాల కింద చాలా మొత్తం చెల్లించారంటూ దీనిపై కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మ‌రీ క‌ష్ట‌ప‌డి ఎక్కువ సంపాదించ‌కండి..భార్యలు భ‌ర్త‌ల‌కంటే భ‌ర‌ణాలే బాగున్నాయ‌నుకుంటే ప్ర‌మాదం అంటూ కామెంట్ చేశారు. జెఫ్ బెజోస్, బిల్ గేట్స్ ల విడాకులు ఇదే విష‌యాన్ని చెప్పాయ‌న్నారు.

Next Story
Share it