వెజ్ బిర్యానీలో నాన్ వెజ్ ముక్క!

స్విగ్గీ. ప్రముఖ ఫుడ్ డెలివరీ కంపెనీ. ఒక మహిళ స్విగ్గీలో వెజ్ బిర్యానీకి ఆర్డర్ పెట్టారు. ఆ ఆర్డర్ డెలివరీ అయింది. దీన్ని తినటానికి ఆమె ఓపెన్ చేశారు. కానీ అందులో మాంసం ముక్క ఒకటి కనిపించటంతో అవాక్కు అవటం ఆమె వంతు అయింది. ఆమె వెజ్ బిర్యానీలో నాన్ వెజ్ ముక్క ఫోటోను మార్క్ చేస్తూ మరి సోషల్ మీడియా లో షేర్ చేశారు. అదే సమయంలో ఆమె మీరు పూర్తిగా వెజిటేరియన్స్ అయితే మాత్రం స్విగ్గీ లో ఆర్డర్ చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలని బాధిత మహిళ నటాషా భరద్వాజ్ సూచించారు. స్విగ్గీ లో తాను ఆర్డర్ చేసిన రెస్టారెంట్ వెజిటేరియన్ గా మార్క్ చేసి ఉంది అని..అందుకే తాను వెజ్ బిర్యాని ఆర్డర్ చేసినట్లు తెలిపారు. అయితే ఇందులో వచ్చిన నాన్ వెజ్ ముక్క మటన్ . చికెన్ ఏదో తనకు మాత్రం తెలియదు అన్నారు.
ఇది తన నమ్మకాలను పూర్తిగా దెబ్బతీయటమే అని...ఇది తీవ్రమైన తప్పిదం అంటూ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. స్విగ్గీ ఎగ్జిక్యూటివ్ ల స్పందన కూడా ఈ విషయంలో ఏ మాత్రం సరిగా లేదు అంటూ ఆమె మండిపడ్డారు. ఆ రెస్టారెంట్ మాత్రం తమ దగ్గర నాన్ వెజ్ ఐటమ్స్ ఉంటాయని చెపుతుంటే...యాప్ లో మాత్రం ఎందుకు వెజ్ గా మార్క్ చేసారో అర్ధం కావటం లేదు అన్నారు. నేరుగా రెస్టారెంట్ తో మాట్లాడి ఇష్యూ ను సాల్వ్ చేసుకోవాలంటూ స్విగ్గీ ప్రతినిధులు చెప్పారంటూ ఆమె తెలిపారు. తమ రెస్టారెంట్ భాగస్వాముల నుంచి ఈ తరహా మిక్స్ అప్స్ తాము ఊహించలేదు అని..తాము ఈ విషయంపై దృష్టి సారిస్తామని స్విగ్గీ స్పందించింది. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు పలు ప్రాంతాల్లో జరిగాయి.



