Telugu Gateway
Top Stories

వ్యాక్సిన్ వేయించుకోలేదు..కానీ సర్టిఫికెట్ వచ్చింది

వ్యాక్సిన్ వేయించుకోలేదు..కానీ సర్టిఫికెట్ వచ్చింది
X

మే8న వాళ్లు వ్యాక్సిన్ వేయించుకుందామనుకున్నారు. ఈ మేరకు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కానీ వ్యాక్సిన్ కొరతతో ఆ రోజు వాళ్లకు వ్యాక్సిన్ డోస్ లు ఇవ్వలేదు. దీంతో ఇంటికి తిరిగొచ్చేశారు. కానీ వాళ్లకు మాత్రం వ్యాక్సినేషన్ పూర్తి అయినట్లు సర్టిఫికెట్లు మాత్రం వచ్చాయంట. ఈ పరిణామం ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. రామ్ లాల్ కేశర్వాణి, సావిత్రి కేశార్వణిలు వ్యాక్సిన్ కోసం యాప్ లో పేర్లు నమోదు చేసుకున్నారు.

వ్యాక్సినేషన్ పూర్తి కాకుండానే సర్టిఫికెట్ వచ్చిన వ్యవహారంపై అధికారులు స్పందిస్తూ ఇది పోర్టల్ లో జరిగిన పొరపాటు అని తేల్చారు. విచిత్రం ఏమిటంటే ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సినేషన్ అయిన వారికి మాత్రం సర్టిఫికెట్లు రాలేదు..కానీ అసలు వ్యాక్సినే వేసుకోని వారికి సర్టిఫికెట్లు వచ్చేశాయి. దేశమంతటా వ్యాక్సినేషన్ పూర్తయ్యే నాటికి ఇలాంటి వింతలు ఎన్ని చూడాల్సి ఉంటుందో.

Next Story
Share it