Telugu Gateway
Top Stories

పోరాటమే నా మార్గం

పోరాటమే నా మార్గం
X

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీ-అదానీల సంబంధంపై స్పందించారు. తనపై అనర్హత వేటు పడటానికి ప్రధాన కారణం ఇదే అన్నారు. పార్లమెంట్ లో తాను లేవనెత్తిన ప్రశ్నల్లో ఒక్కదానికి కూడా సమాధానం రాలేదు అని...తాజాగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అదానీ ఏర్పాటు చేసిన షెల్ కంపెనీల్లోకి 20 వేల కోట్ల రూపాయల నిధులు వెళ్లాయని..అవి ఎవరివో తేలాలి అన్నారు. కచ్చితంగా అవి అదానీ నిధులు మాత్రం కాదు...అంత మొత్తాన్ని అదానీ సమీకరించలేరు అన్నారు. లోక్ సభలో తాను ప్రధాని, అదానీ బంధాన్ని వెల్లడిస్తే చివరకు వాటిని రికార్డు ల నుంచి కూడా తొలగించారు అని...తనపై కొంత మంది మంత్రులు ఆరోపణలు చేశారు అని తప్పుపట్టారు. నిబంధనల ప్రకారం సభలో ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తికి వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అని..తనకు అది కూడా రాలేదు అన్నారు. తాను చెప్పిన అంశాలకు సంబంధించి స్పీకర్ కు ఆధారాలు లేఖ ద్వారా సమర్పించినట్లు వెల్లడించారు. అయినా సరే తనకు మాత్రం మాట్లాడే అవకాశం రాలేదు అన్నారు. వాస్తవాలను తప్పుదారి పట్టించి...అదానీ-ప్రధాని మధ్య ఉన్న సంబంధాన్ని దాయటానికి ప్రయతిస్తున్నారు అని ఆరోపించారు.

మోడీ సర్కారు తనను జైలు లో పెట్టిన. సభ్యత్వం రద్దు చేసిన...శాశ్వతంగా అనర్హుడుగా ప్రకటించినా తాను మాత్రం సత్యం మాత్రమే చెపుతాను అని...దానికోసమే పోరాటం చేస్తానని ప్రకటించారు. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని...తనకు మద్దదు ప్రకటించినా పార్టీలు అన్నింటికీ రాహుల్ ధన్యవాదాలు తెలిపారు. అందరిని కలుపుకుని ముందుకు సాగుతామని వెల్లడించారు. బ్రిటన్ లో తాను అనని మాటలను అన్నట్లు చెపుతున్నారు అని...తాను క్షమాపణ చెప్పే ప్రశ్న ఉత్పన్నం కాదు అని స్పష్టం చేశారు. దేశంలోనే అత్యంత అవినీతి వ్యక్తికి ప్రధాని మోడీ ఎందుకు మద్దతుగా నిలుస్తున్నారు చెప్పాలని డిమాండ్ చేశారు. అదానీ ఇష్యూని పక్కదారి పట్టించేందుకే తనపై అనర్హత ఇష్యూ ని తెరపైకి తెచ్చారు అని తెలిపారు. అయినా సరే తన గొంతు నొక్కలేరు అని తాను మాట్లాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. ఇప్పుడు దేశం అంటే అదానీ...అదానీ అంటే దేశం అనే పరిస్థితి ఉంది అని ఎద్దేవా చేశారు. ప్రధాన అంశంపై దృష్టి మరల్చటం కోసమే ఓబీసీ లను విమర్శించాను వంటి తప్పదు ప్రచారం చేస్తున్నారు అని మండిపడ్డారు.

Next Story
Share it