Telugu Gateway
Top Stories

ఒక వైపు జె డీ వాన్స్ ప్రకటన..ఇప్పుడు మిస్సింగ్!

ఒక వైపు జె డీ వాన్స్ ప్రకటన..ఇప్పుడు మిస్సింగ్!
X

అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సంగతి తెలిసి కూడా కూడా ఆ దేశ ఉపాధ్యక్షుడు జె డి వాన్స్ అంత పెద్ద ప్రకటన చేశారు అంటే అది ఆషామాషీ వ్యవహారం కాదు. ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూ లో కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. దేశంలో భయంకరమైన విషాదం చోటు చేసుకుంటే తాను అధ్యక్ష బాధ్యతలు స్వీకరించటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఒక వైపు అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం బాగాలేదు అని వార్తలు వస్తున్న తరుణంలో జె డి వాన్స్ ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే జె డి వాన్స్ మాత్రం ట్రంప్ ఎంతో ఆరోగ్యంగా...ఉత్సాహం గా ఉన్నారు అని చెప్పుకొచ్చారు. అందరికంటే చివర నిద్రపోయేది ఆయనే అని..అదే సమయంలో అందరికంటే ముందు నిద్ర లేచి పని చేసేది కూడా ట్రంప్ మాత్రమే అని జె డి వాన్స్ వెల్లడించారు. అన్ని ఆటంకాలు అధిగమించి ట్రంప్ తన పదవి కాలాన్ని పూర్తి చేసుకుంటారు అని...కానీ ఏదైనా విషాదం చోటు చేసుకుంటే మాత్రం తాను బాధ్యతలు స్వీకరిస్తాను అని తెలిపారు. ట్రంప్ అనారోగ్యం వార్తలు వస్తున్న తరుణంలో తాజాగా ఆయన మిస్సింగ్ వార్తలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

డోనాల్డ్ ట్రంప్ అన్నీ తన సోషల్ మీడియా ట్రూత్ ద్వారానే వెల్లడిస్తున్నారు తప్ప...ఎక్కడా బయట కనిపించటం లేదు. ఆగస్ట్ 30 , 31 తేదీల్లో వైట్ హౌస్ వేదికగా ఎలాంటి పబ్లిక్ ఈవెంట్స్ లేకపోవటంతో ట్రంప్ ఆరోగ్యంపై అనుమానాలు మరింత బలపడుతున్నాయి అని చెపుతున్నారు. కాకపోతే ట్రంప్ వైద్యులు మాత్రం ఆయన పూర్తి ఆరోగ్యంగానే ఉన్నారు అని...కాకపోతే చేతికి గాయం నిజమే అని డాక్టర్ సీన్ బార్బెల్లా వెల్లడించారు. ట్రంప్ అనారోగ్యం వార్తలు ఆయన అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియా లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Next Story
Share it