Telugu Gateway
Top Stories

ర‌ష్య‌న్ బిలియ‌నీర్ల ప్రైవెట్ జెట్స్ స్వాధీనం

ర‌ష్య‌న్ బిలియ‌నీర్ల ప్రైవెట్ జెట్స్ స్వాధీనం
X

ఉక్రెయిన్ పై దాడికి దిగిన ర‌ష్యాపై అమెరికా కొర‌డా ఝుళిపిస్తోంది. ఇప్ప‌టికే ప‌లు ఆంక్షలు విధించిన అగ్ర‌రాజ్యం ఇప్పుడు కొత్త‌గా మ‌రికొన్ని నిర్ణ‌యాలు తీసుకుంది. అందులో భాగంగా ర‌ష్యా బిలీయ‌నీర్లకు చెందిన విలాస‌వంత‌మైన నౌక‌లు, అపార్ట్ మెంట్లు, ప్రైవేట్ జెట్స్ ను స్వాధీనం చేసుకుంటామ‌ని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ప్ర‌కటించారు. అమెరికాతోపాటు యూరోపియ‌న్ దేశాలు కూడా ఇదే బాట‌లో ప‌య‌నించనున్నాయి. యుద్ధాన్ని నిరోధించేందుకు ర‌ష్యా ప్రెసిడెంట్ పుతిన్ ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోవ‌టం లేద‌ని.ఈ ప్ర‌భావం ఎలా ఉండ‌బోతుందో భ‌విష్య‌త్ లో ఆయ‌న చ‌విచూస్తార‌ని బైడెన్ హెచ్చ‌రించారు. అమెరికాతోపాటు ప‌లు దేశాలు ఆర్ధిక ఆంక్షలు విధించ‌టంతో ర‌ష్యా క‌రెన్సీ రూబుల్ కుప్ప‌కూలుతోంది. ఇది పుతిన్ ను కూడా ఆందోళ‌న‌లో పడేస్తుంద‌ని చెబుతున్నారు.

Next Story
Share it