Telugu Gateway
Top Stories

మాయం కానున్న విస్తారా బ్రాండ్!

మాయం కానున్న విస్తారా బ్రాండ్!
X

దేశ విమానయాన రంగంలో కీలక మార్పులు జరగబోతున్నాయి. టాటా గ్రూప్ తన ఆధీనంలోని అన్ని ఎయిర్ లైన్స్ ను ఎయిర్ ఇండియా పరిధిలోకి తీసుకొచ్చే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇది పూర్తి అయిన తర్వాత విమానాల సంఖ్య, మార్కెట్ వాటా పరంగా ఎయిర్ ఇండియా రెండవ అది పెద్ద ఎయిర్ లైన్ గా అవతరించే అవకాశం ఉంది. టాటా గ్రూప్ అధీనంలో ఉన్న విస్తారా, ఎయిర్ ఏసియా ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ లను పూర్తిగా ఎయిర్ ఇండియా పరిధిలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. విస్తారా ఎయిర్ లైన్స్ లో సింగపూర్ ఎయిర్ లైన్స్ కూడా వాటా ఉన్న విషయం తెలిసిందే. ఈ రెండు సంస్థలు గత కొంత కాలంగా ఈ విలీనంపై చర్చలు సాగిస్తున్నాయి. అన్ని ఎయిర్ లైన్స్ ఒకే గొడుకు కిందకు వచ్చిన తర్వాత ఒక లో కాస్ట్ ఎయిర్ లైన్, పూర్తి స్థాయి సర్వీస్ ఎయిర్ లైన్ గా ఎయిర్ ఇండియా కొనసాగనుంది.

దీనికి సంబంధించి ఒక వారం రోజుల్లేనే ప్రకటన వెలువడే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇది అంత పూర్తి కావటానికి ఏడాది సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఆ సమయంలోనే విస్తారా బ్రాండ్ ను కూడా డ్రాప్ చేసే అవకాశం ఉందని సమాచారం. సింగపూర్ ఎయిర్ లైన్స్ కు ఇందులో ఉన్న వాటా కు అనుగుణంగా ఎయిర్ ఇండియా లో ఆ సంస్థకు మైనారిటీ వాటా దక్కుతుందని చెపుతున్నారు. అదే సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం...కొత్త విమానాలు కొనుగోలు వంటి పెట్టుబడుల కోసం ఎయిర్ ఇండియా స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉందని చెపుతున్నారు. అయితే ఇది ఎప్పుడు ఉంటది అన్న అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది.

Next Story
Share it