Telugu Gateway
Top Stories

విమానాల రద్దు..సర్వీసుల్లో విపరీత జాప్యం(Vistara Flight cancellations)

విమానాల  రద్దు..సర్వీసుల్లో విపరీత జాప్యం(Vistara Flight cancellations)
X

దేశంలోని ప్రముఖ ఎయిర్ లైన్స్ లో విస్తార ఒకటి. టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్ లైన్స్ లు సంయుక్తంగా ఈ ఎయిర్ లైన్స్ ను రేపటి చేశాయి. త్వరలోనే ఈ ఎయిర్ లైన్స్ కూడా ఎయిర్ ఇండియా లో విలీనం కానుంది. పైలట్స్ కొరత కారణంగా గత రెండు రోజులుగా విస్తార ఎయిర్ లైన్స్ విమానాలు పెద్ద ఎత్తున రద్దు అవుతూ వస్తున్నాయి. సోమవారం తో పాటు మంగళవారం నాడు కూడా ఇదే పరిణామం చోటు చేసుకుంది. ఏప్రిల్ 2 న విస్తార ఎయిర్ లైన్స్ కు సంబంధించి ఏకంగా 38 సర్వీస్ లు రద్దు అయ్యాయి. ఈ ఎయిర్ లైన్స్ కు చెందిన పైలట్లు ఎక్కువ మంది ఒకేసారి సిక్ లీవ్స్ పెట్టారు. తాజా పరిణామాలపై కేంద్ర పౌర విమానయాన శాఖ సమగ్ర నివేదిక అందచేయాల్సిందిగా విస్తార ఎయిర్ లైన్స్ ను ఆదేశించింది. పెద్ద ఎత్తున విమానాలు రద్దు కావటం తో పాటు మరి కొన్ని విమానాల్లో విపరీతమైన జాప్యం చోటు చేసుకుంటోంది. ఎయిర్ ఇండియా లో విలీనం సందర్భంగా విస్తార కు చెందిన పైలట్స్ వేతనాలను సవరించాలని నిర్ణయించటమే ప్రస్తుత పరిస్థితికి కారణంగా చెపుతున్నారు.

ఇదే జరిగితే ఇప్పుడు వాళ్ళు అందుకుంటున్న వేతనంలో పెద్ద ఎత్తున కోత పడే అవకాశం ఉండటంతో వీళ్ళు ఆందోళన బాటలో పయనిస్తున్నారు. విస్తార విమానాల రద్దు, సర్వీస్ ల జాప్యంపై ప్రయాణికులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ ఇండియా పైలట్స్ కు ఇస్తున్న తరహాలోనే వేతనాలు తీసుకోవటానికి అంగీకరించాలని కోరుతూ ఇటీవల విస్తార ఎయిర్ లైన్స్ యాజమాన్యం పైలట్స్ కు మెయిల్ పంపింది. అప్పటి నుంచే పైలట్స్ ఆందోళన ప్రారంభం అయింది. మరి ఇప్పుడు విస్తార యాజమాన్యం ఈ సమస్యను ఎలా కొలిక్కి తెస్తుందో వేచిచూడాల్సిందే. కొద్ది రోజుల క్రితం ఆకాశ ఎయిర్ లైన్స్ లో కూడా ఇదే తరహాలో పైలట్స్ మూకుమ్మడి సెలవుల కారణంగా సర్వీస్ లపై తీవ్ర ప్రభావం పడిన విషయం తెలిసిందే.

Next Story
Share it