Telugu Gateway
Top Stories

చేతులు కలిపిన అదానీ గ్రూప్-వీసా

చేతులు కలిపిన అదానీ గ్రూప్-వీసా
X

అదానీ గ్రూప్ మళ్ళీ దూకుడు పెంచినట్లు కనిపిస్తోంది. కొద్దినెలల పాటు అమెరికా కు చెందిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ నివేదిక ప్రకంపనలు ఆ గ్రూపుపై కొనసాగిన విషయం తెలిసిందే. ఇప్పటికే దీని నుంచి అదానీ గ్రూప్ బయటపడినట్లే కనిపిస్తోంది. తాజాగా ఒకే రోజులో అదానీ కంపెనీల మార్కెట్ విలువ 50 వేల కోట్ల రూపాయల మేర పెరిగిన విషయం తెలిసిందే. ఈ జోష్ కొనసాగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం కేంద్రంలో అధికారం లో ఉన్న మోడీ సర్కారు అండదండలు అని రాజకీయ, అధికార వర్గాల్లో ప్రచారంలో ఉంది. ఇప్పుడు తాజాగా అదానీ గ్రూప్ అమెరికా కు చెందిన వీసా తో జట్టుకట్టి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డు జారీకి రంగం సిద్ధం చేసుకుంటోంది. ముఖ్యంగా దేశంలో ఉన్న 40 కోట్ల మంది ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా దీన్ని ప్లాన్ చేసినట్లు చెపుతున్నారు.

ఈ కార్డు వలన ఎయిర్ పోర్ట్ సర్వీస్, రిటైల్, ఆన్ లైన్ ట్రావెల్ సర్వీస్ లను ఉపయోగించడానికి వీలుగా ఉండేలా రూపొందించనున్నారట. ఈ విషయాలను వీసా సీఈఓ ర్యాన్ మెక్ నార్ని తెలియచేశారు. ప్రస్తుతం అదానీ గ్రూప్ చేతిలో ముంబై తో పాటు మొత్తం ఏడు విమానాశ్రయాలు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే అదానీ గ్రూప్ అదానీ వన్ పేరుతో ఒక వెబ్ సైట్...యాప్ నిర్వహిస్తూ అన్ని ట్రావెల్ సర్వీసులు దీని ద్వారా అందిస్తోంది. ఇప్పుడు వీసా తో కలిసి క్రెడిట్ కార్డు జారీ ప్రయత్నాల్లో ఉంది. త్వరలోనే ఈ కార్డు లు మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉంది అని చెపుతున్నారు.

Next Story
Share it