Telugu Gateway
Top Stories

ప్ర‌పంచంలోనే ఎంట్రీ ఫీజు పెట్టిన తొలి న‌గ‌రం

ప్ర‌పంచంలోనే ఎంట్రీ ఫీజు పెట్టిన తొలి న‌గ‌రం
X

ప్ర‌పంచంలో ఇప్పుడు ఏ న‌గ‌రానికి అయినా వీసా ఉంటే విమాన టిక్కెట్ కొనుక్కొని ఎంచ‌క్కా ప‌ర్య‌టించ‌వ‌చ్చు. కానీ ఇక నుంచి అక్క‌డ అలా చెల్లుబాటు కాదు. విమాన టిక్కెటే కాదు..ఆ నగ‌రంలోకి ప్ర‌వేశించాలంటే కూడా టిక్కెట్ కొనుక్కోవాలంట‌. అవును ఓవ‌ర్ టూరిజం నుంచి త‌ట్టుకునేందుకు ఈ ప్లాన్ వేశారు. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమ‌ల్లోకి తీసుకున్నారు. ప్ర‌పంచంలోని అత్యుత్త‌మ అంద‌మైన నగ‌రంగా పేరుగాంచిన ఇటలీలోని వెనిస్ లో ఇది అమ‌లు చేయ‌నున్నారు. ప‌ర్యాట‌కుల ర‌ద్దీని త‌ట్టుకునేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు.2023 జ‌న‌వ‌రి 16 నుంచి ప‌ర్యాట‌కులు వెనిస్ న‌గ‌రాన్ని సంద‌ర్శించాలంటే ఖ‌చ్చితంగా ఆన్ లైన్ ఎంట్రీ టిక్కెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

ఈ ఎంట్రీ టిక్కెట్ ధ‌ర గ‌రిష్టంగా 823 రూపాయ‌ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అంచ‌నా. సంద‌ర్శ‌కులు పెరిగే కొద్దీ టిక్కెట్ రేటు కూడా పెరుగుతూపోతుంది. వెనిస్ సిటీ గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా ఓవ‌ర్ టూరిజంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంద‌ని అక్కడి అధికారులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అయితే రాత్రి అక్క‌డే హోట‌ళ్ళ‌లో బ‌స చేసే ప‌ర్యాట‌కుల‌కు ఎలాంటి టిక్కెట్ ఉండ‌దు. ఎవరైనా ప‌ర్యాట‌కులు ఎంట్రీ టిక్కెట్ విష‌యంలో నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే మాత్రం భారీగా జరిమానాలు విధించ‌నున్నారు. అయితే అక్క‌డి వ‌ర‌కూ వెళ్లిన వారికి ఎంట్రీ టిక్కెట్ భారం అవుతుందా?.

Next Story
Share it