వామ్మో... ఈనెంబర్ ప్లేట్ ఖరీదు 73 కోట్లు అట!
ఫ్యాన్సీ నెంబర్ల పిచ్చి ఒక్క దేశంలోనే కాదు..ప్రపంచ వ్యాప్తంగా ఉన్నట్లే ఉంది. తాజాగా ఈ వేలం చూసిన వారెవరికైనా ఇదే సందేహం రావటం ఖాయం. ఎందుకంటే ఏఏ8 నెంబర్ కోసం ఓ వ్యక్తి ఏకంగా 73 కోట్ల రూపాయలు వెచ్చించారు. ఇది దుబాయ్ లో జరిగింది. అయితే ఈ నెంబర్ ప్రపంచంలోనే మూడవ అత్యంత ఖరీదైన డీల్ గా చెబుతున్నారు. గతంలో ఎఫ్ 55, వి66 నెంబర్ ప్లేట్లకు మంచి డిమాండ్ వచ్చినా వీటి ధర ఒక్కొక్కటీ 8.34 కోట్ల రూపాయలే పలికాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే 73 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని ఖరీదైన కార్లు వస్తాయో. కానీ దుబాయ్ వ్యక్తి ఏకంగా ఓ నెంబర్ ప్లేట్ నే 73 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేశారంటే ఇది మామూలు విషయం కాదు మరి. ఇటీవలే చండీఘడ్ లో ఓ వ్యక్తి తన ద్విచక్ర వాహనం 71 వేల రూపాయలు పెట్టి ద్విచక్ర వాహనం కొనుగోలు చేసి..నెంబర్ కోసం ఏకంగా 15 లక్షల రూపాయలుపైగా వ్యయం చేశాడు.