Telugu Gateway
Top Stories

అదిరేలా వందే భారత్ స్లీపర్ క్లాస్ సౌకర్యాలు

అదిరేలా వందే భారత్ స్లీపర్ క్లాస్ సౌకర్యాలు
X

భారతీయ రైల్వేల్లో వందే భారత్ ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కేంద్ర రైల్వే శాఖ వివిధ మార్గాల్లో పెద్ద ఎత్తున వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతోంది. ఇవి ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి అనే చెప్పాలి. అయితే వందే భారత్ రైళ్లలో చార్జీలపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు ఉన్నాయి. తమిళ నాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు మరికొంత మంది సీఎం లు కూడా వందే భారత్ ట్రైన్స్ లో చార్జీలు తగ్గించాలి అని డిమాండ్ చేశారు. కేంద్రం ఒక వైపు ప్యాసింజర్‌ రైళ్లను పక్కన పెట్టి వందే భారత్ ట్రైన్స్ తో ప్రజలపై భారం మోపుతోంది అనే విమర్శలు సైతం ఉన్నాయి. ఇప్పటివరకు వందే భారత్ లో ఓన్లీ చైర్ కార్ సౌకర్యం మాత్రమే ఉన్న విషయం తెలిసిందే.

వచ్చే ఏడాది నుంచి స్లీపర్ వెర్షన్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఈ ట్రైన్ మోడల్ కు సంబంధించిన కొన్నిఫోటోలను అయన సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. స్లీపర్ వెర్షన్ కాన్సెప్ట్ ట్రైన్ వివరాలు పంచుకున్నారు. ప్రస్తుతం రైళ్లలో ఉన్న వాటికంటే మరింత వెడల్పుగా బెర్తులు ఉండటంతో పాటు మెరుగైన ఇంటీరియర్స్ ఉంటాయని తెలిపారు. ఈ ఫోటోలపై నెటిజన్స్ స్పందిస్తూ ఇవి ఫ్లైట్ లో బిజినెస్ క్లాస్ తరహాలో ఉన్నాయంటూ కామెంట్ చేశారు. వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి రానున్న స్లీపర్ వందే భారత్ రైళ్లలో చార్జీలు ఎలా ఉంటాయో వేచిచుడాల్సిందే. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం చూసుకుంటే ఇవి కూడా ప్రీమియం రేంజ్ లోనే ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.

Next Story
Share it