Telugu Gateway
Top Stories

కరోనా అంతానికి వ్యాక్సిన్ ఒక్కటే చాలదు

కరోనా అంతానికి వ్యాక్సిన్ ఒక్కటే చాలదు
X

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) డైరక్టర్ జనరల్ ట్రెడోస్ అథనామ్ కరోనా వ్యాక్సిన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. కోవిడ్ 19ను అంతం చేసేందుకు వ్యాక్సిన్ ఒక్కటే సరిపోదని అన్నారు. ఇప్పటికే ఉన్న ఉపకరణాలకు తోడు వ్యాక్సిన్ కూడా ఓ ఆయుధంగా ఉపయోగపడుతుందని అన్నారు. అయితే వ్యాక్సిన్ తో ఈ మహమ్మారి అంతం కాదని తెలిపారు.

తొలి దశలో వ్యాక్సిన్ సరఫరాను హెల్త్ వర్కర్స్, వృద్ధులు, ఇతర రిస్క్ ఉన్న వారికే అనుమతించనున్నట్లు తెలిపారు. ఇది కరోనా మృతులను తగ్గించటంతోపాటు వైద్య వ్యవస్థను గాడిన పెట్టడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. అయితే వైరస్ కొత్త మార్పులు పొందేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దీనిపై నిఘా పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు.

Next Story
Share it