Telugu Gateway
Top Stories

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర 250 రూపాయలు

ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ ధర 250 రూపాయలు
X

కరోనా వ్యాక్సిన్ ఇక మరింత అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకూ పరిమితం వినియోగంలో ఉన్న ఈ వ్యాక్సిన్ ఇప్పుడు ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ లభించనుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ తీసుకోవాలంటే 250 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో వ్యాక్సిన్ ధర 150 రూపాయిలు అయితే...సర్వీస్ ఛార్జి 100 రూపాయలుగా నిర్ణయించారు. కేంద్రం ఈ ధరలను ఖరారు చేసింది. అయితే ప్రభుత్వం మాత్రం ఉచితంగానే వ్యాక్సిన్ అందిస్తోంది. ప్రభుత్వ వ్యాక్సిన్‌ కేంద్రాల్లో ఉచితంగా వాక్సినేషన్‌ పంపిణీ చేయనుంది.

ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు స్థానికంగా ఉన్న ప్రైవేట్ వాక్సినేషన్ కేంద్రాలకు టీకా ధరలను తెలియజేయాలని కేంద్రం పేర్కొంది. తొలిదశలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌ కు కరోనా వ్యాక్సిన్ అందించిన కేంద్రం మార్చి 1 నుంచి 65 ఏళ్లు పైబడిన వారికి, దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి పంపిణీ చేయనున్నట్లు కేంద్ర మంత్రి ప్రకాశ్ జావదేకర్ తెలిపారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేట్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ హాస్పిటళ్లలో కరోనా టీకాను ఉచితంగా అందించనున్నట్లు వెల్లడించారు.

Next Story
Share it