ప్రైవేట్ ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సిన్లు
కేంద్రం తీసుకున్న తాజా విధాన నిర్ణయంలో భాగంగా వ్యాక్సిన్ తయారీదారులు ప్రైవేటు ఆసుపత్రులకు 25 శాతం వ్యాక్సిన్ ఉత్పత్తిని అమ్ముకోవచ్చు. ఎంత వేగంగా వేసినా దేశంలోని ప్రజలందరికీ వ్యాక్సిన్లు చేరటానికి సుదీర్ఘ సమయం పడుతుంది. అయితే ప్రైవేట్ ఆస్పత్రులకు 25 శాతం వ్యాక్సిన్లు కేటాయించటం ద్వారా కొనుగోలు చేయగలవారు ప్రభుత్వ వ్యాక్సినేషన్ వంతు వచ్చే వరకూ ఆగకుండా ప్రైవేట్ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు వేయించుకోవటానికి ఇది దోహదపడుతుంది. సోమవారం నాడు ఉచిత వ్యాక్సినేషన్ ప్రకటన సమయంలోనే ప్రధాని మోడీ ఈ విషయం వెల్లడించారు.
దేశంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ సంస్థలతోపాటు బడాబడా కార్పొరేట్ సంస్థలు అన్నీ కూడా తాము సొంతంగా తమ ఉద్యోగులుకు వ్యాక్సిన్ వేయించుతామని ప్రకటించాయి. ఇందుకు అయ్యే ఖర్చు అంతా కూడా తాము భరిస్తామని వెల్లడించాయి. ఈ మేరకు ఇప్పటికే ప్రకటనలు కూడా చేశాయి. వారికి ఈ వ్యాక్సిన్లు అందుబాటులో ఉండబోతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రులలో మాత్రమే వ్యాక్సిన్ వేసినందుకు 150 రూపాయలు సర్వీసు ఛార్జి చెల్లించాల్సి ఉంటుంది.