Telugu Gateway
Top Stories

కోవాగ్జిన్ అత్య‌వ‌స‌ర ఉప‌యోగానికి యూఎస్ ఎప్ డిఏ నో

కోవాగ్జిన్ అత్య‌వ‌స‌ర ఉప‌యోగానికి యూఎస్ ఎప్ డిఏ నో
X

దేశీయంగా భార‌త్ బ‌యోటెక్ అభివృద్ది చేసిన క‌రోనా వ్యాక్సిన్ కు అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్ర‌గ్ అడ్మినిస్ట్రేష‌న్ (ఎఫ్ డిఏ) నో చెప్పింది. కోవాగ్జిన్ అత్య‌వ‌స‌ర వినియోగం కోసం ద‌ర‌ఖాస్తు చేయ‌గా ఎఫ్ డిఏ తిర‌స్క‌రించింది. అమెరికాకు చెందిన భాగ‌స్వామ్య సంస్థ ఆక్యుజెన్ తో క‌ల‌సి భార‌త్ బ‌యోటెక్ ఈ ద‌ర‌ఖాస్తు చేసింది. కోవాగ్జిన్ ఇప్ప‌టికే 14 దేశాల్లో అత్య‌వ‌స‌ర ఉప‌యోగ అనుమ‌తి (ఈయూఏ) పొందిన‌ట్లు కంపెనీ వెల్ల‌డించింది. మ‌రో 50 దేశాల్లో ఈయూఏ పొందేందుకు అవ‌స‌ర‌మైన ప‌నుల్లో ఉన్న‌ట్లు తెలిపింది. అత్య‌వ‌స‌ర వినియోగ అనుమ‌తికి నో చెప్పిన ఎప్ డిఏ ఆక్యుజెన్ కు పూర్తి స్థాయి వ్యాక్సిన్ అనుమ‌తి అయిన బ‌యోలాజిక్స్ లైసెన్స్ అప్లికేష‌న్స్ (బిఎల్ఏ) కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సిందిగా సూచించింద‌ని తెలిపారు. అన్ని సంస్థ‌లు విధిగా బిఎల్ ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

దీంతో కోవాగ్జిన్ ఇత‌ర క్లినిక‌ల్ డేటాతోపాటు మ‌రింత స‌మాచారం అందించి ఎప్ డిఏ అనుమ‌తి పొందాల్సి ఉంటుంది.ఇప్ప‌టికే భార‌త్ లో త‌యారు చేసిన ఏ వ్యాక్సిన్ కూడా అమెరికాలో అత్య‌వ‌స‌ర అనుమ‌తి పొంద‌టం కానీ..బిఎల్ఏ పొంద‌లేద‌ని తెలిపారు. కోవాగ్జిన్‌కు సంబంధించిన మాస్టర్ ఫైల్‌ను అందజేయాలని ఎఫ్‌డీఏ సూచించినట్లు కూడా ఆక్యుజెన్ సీఈవో శంకర్ ముసునూరి తెలిపారు. తమ టీకా కోవాగ్జిన్‌ను యూఎస్‌కు అందించేందు తాము కట్టుబడి ఉన్నామన్నారు. అలాగే కోవాక్సిన్ కోసం మార్కెటింగ్ అప్లికేషన్‌ కోసం అదనపు క్లినికల్ ట్రయల్స్‌ డేటా అవసరమని కంపెనీ భావిస్తోంది.

Next Story
Share it