Telugu Gateway
Top Stories

అమెరికా వీసా చార్జీల పెంపు

అమెరికా వీసా చార్జీల పెంపు
X

అగ్రరాజ్యం అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. స్టూడెంట్ వీసాల తో పాటు పర్యాటక, బిజినెస్ వీసాల ఫీజు పెంచారు. బీ 1 , బీ 2 , బీసిసి వీసాలు ఈ పెంపు పరిధిలోకి రానున్నాయి. ప్రస్తుతం స్టూడెంట్, ఎక్స్చేంజ్ విజిటర్ వీసాల ఫీజు భారతీయ కరెన్సీ లో 13 వేల రూపాయలు ఉండగా..దీని ఇప్పుడు 15 ,140 రూపాయలకు పెంచారు. పెరిగిన ఈ చార్జీలు మే 30 నుంచి అమల్లోకి రానున్నాయి. తాత్కాలిక పనుల కోసం అమెరికాకు వెళ్లే వారికీ జారీచేసే నాన్ ఇమ్మిగ్రంట్ అంటే హెచ్, ఎల్, ఓ, పీ, క్యూ , ఆర్ కేటగిరీ వీసాల ఛార్జ్ ని కూడా 15550 రూపాయల నుంచి 16780 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.

ఈ మేరకు అమెరికా డిపార్ట్మెంట్ అఫ్ స్టేట్ తన వెబ్ సైట్ లో అధికారికంగా ఈ విషయాలను వెల్లడించింది. ఉన్నత విద్య కోసం భారత్ నుంచి ప్రతి ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అమెరిగా వెళతారు అనే విషయం తెలిసిందే. గత ఏడాది భారతీయ విద్యార్థులు పెద్ద ఎత్తున అమెరికా వెళ్లినట్లు నివేదికలు చెపుతున్నాయి. గత కొంత కాలంగా ఇండియా లో అమెరికా వీసా కోసం వేచిచూడాల్సిన సమయం మరీ ఎక్కువగా ఉండటంతో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు పరిస్థితి కొంత మెరుగు అయింది అని చెపుతున్నారు.

Next Story
Share it