Telugu Gateway
Top Stories

అమెరికా ఆఫర్

అమెరికా ఆఫర్
X

ఎవరూ ఊహించని రీతిలో టార్గెట్ గా ఫిబ్రవరి 28 న జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ ని హతమార్చిన అమెరికా ఇప్పుడు మరో ప్లాన్ వేసింది. ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ గా ఎన్నికైన మొజ్తాబా ఖమేనీని కూడా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. ఒక వైపు భీకర దాడులు చేస్తూనే మరో వైపు దీని కోసం ఒక భారీ ఆఫర్ ప్రకటించింది. మొజ్తాబా ఖమేనీ ఎక్కడ ఉన్నారు అనే సమాచారాన్ని చెపితే వాళ్లకు ఏకంగా పది మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తామని అమెరికా ప్రకటించింది. ఈ మొత్తం భారతీయ కరెన్సీ లో దగ్గర దగ్గర 93 కోట్ల రూపాయలు అవుతుంది. అదే సమయంలో ఈ సమాచారం ఇచ్చిన వాళ్లకు పునరావాసం కూడా కల్పిస్తామని అమెరికా అధికారికంగానే వెల్లడించింది. 'రివార్డ్ ఫర్ జస్టిస్' కార్యక్రమం క్రింద ఈ బౌంటీ ఇస్తామని తెలిపింది. అమెరికా విదేశాంగ నిర్వహించే ఒక ముఖ్యమైన ఉగ్రవాద నిరోధక కార్యక్రమమే 'రివార్డ్ ఫర్ జస్టిస్'.

ఈ కార్యక్రమం కింద అంతర్జాతీయ నేరస్తులు, నెట్‌వర్క్‌ల సమాచారం అందించి, వారిని పట్టుకోవడంలో సహాయపడిన వారికి మిలియన్ డాలర్ల రివార్డు ఇస్తుంటారు. అమెరికన్ల రక్షణ, జాతీయ భద్రత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఆర్‌ఎఫ్‌జే పనిచేస్తుంది. అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించిన వ్యక్తుల జాబితా మొజ్తాబాతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ అలీ అస్గర్ హెజాజీ, సెక్యూరిటీ కౌన్సిల్ చీప్ అలీ లారీజానీ, ఇతర సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. యుద్ధం మొదలైన తర్వాత ఇప్పటి వరకు మొజ్తాబా ఖమేనీ ఎక్కడా బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంపై స్పష్టత లేదు. అయితే ఇటీవల అమెరికా మాత్రం తమ దాడుల్లో మొజ్తాబా ఖమేనీ భారీగా గాయపడ్డారు అని ప్రకటించిన సంగతి తెలిసిందే.

Next Story
Share it