Telugu Gateway
Top Stories

అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ రిలీఫ్

అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ రిలీఫ్
X

ఫైజర్ వ్యాక్సిన్ కు అమెరికా ఎఫ్ డిఏ ఆమోదం

అగ్రరాజ్యం అమెరికాకు బిగ్ రిలీఫ్. దేశంలో కరోనా కేసులు విలయతాండవం చేస్తున్న తరుణంలో అమెరికాకు చెందిన ఔషధ నియంత్రణా సంస్థ (ఎఫ్ డిఏ) ఫైజర్ వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే నిపుణుల కమిటీ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎఫ్ డిఏ ఓకే చెప్పటంతో సత్వరమే అమెరికాలో వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. దీనికి అవసరమైన ఏర్పాట్లను ట్రంప్ సర్కారు ఇఫ్పటికే చేసి పెట్టింది. కోవిడ్-19 అంతానికి ఫైజర్ బయోఎన్‌టెక్ టీకా అత్యవసర వినియోగానికి ఆమోదం తెలుపుతున్నామని ఎఫ్‌డీఏ చీఫ్ సైంటిస్ట్ డెనైజ్ హింటన్ పేర్కొన్నారు. మరోవైపు అమెరికన్లందరికీ ఫైజర్‌ వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించనున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.

కేవలం తొమ్మిదినెలల్లోనే అద్భుతమైన విజయాన్ని సాధించామని, ఇది నిజంగా శుభవార్త అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు. సైన్సుపరంగా చరిత్రలో ఇదొక చారిత్రాత్మక సందర్బమని పేర్కొన్నారు. కఠినమైన పరీక్షల అనంతరం ఈ వ్యాక్సిన్‌కు అమోదం లభించిందని, 24 గంటల్లోనే వాక్సినేషన్‌ ప్ర్రక్రియ మొదలవుతుందని ఆయన వెల్లడించారు. ఫైజర్ వ్యాక్సిన్ కోసం అమెరికా ప్రజలు కూడా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఆ క్షణం రానే వచ్చింది. కొత్త సంవత్సరానికి ముందు ఎఫ్ డీఏ ఈ వ్యాక్సిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో కోటి ఆశలతో నూతన సంవత్సరంలోకి ప్రవేశించేందుకు ఆశలు చిగురించినట్లు అయింది.

Next Story
Share it