Telugu Gateway
Top Stories

అమెరికా అదనపు అప్పులకు లైన్ క్లియర్ !

అమెరికా అదనపు అప్పులకు లైన్ క్లియర్ !
X

అగ్ర రాజ్యం అమెరికా డిఫాల్ట్ సమస్య నుంచి బయటపడినట్లే. ఆ దేశ అప్పు పరిమితి పెంచటానికి బైడెన్ సర్కారు, రిపబ్లికన్స్ ఒక తాత్కాలిక ఒప్పందానికి వచ్చారు. ఈ విషయాన్ని రిపబ్లికన్ స్పీకర్ కెవిన్ మెకార్తి కూడా నిర్దారించారు. ప్రస్తుతం అమెరికా 31 .4 ట్రిలియన్ డాలర్స్ కు మించి అప్పు చేయటానికి వీలు లేదు. ఇప్పటికే ఈ అప్పు పరిమితి మించి పోయింది. అదనపు అప్పులు చేయాలంటే ఈ పరిమితి పెంచక తప్పని పరిస్థితి. గత కొన్ని రోజులుగా దీనిపై డెమాక్రాట్స్, రిపబ్లికన్ల మధ్య ఏకాభిప్రాయం రాలేదు. చివరి దశలో ఒక అంగీకారానికి రావటంతో అమెరికా ఇప్పుడు పెద్ద సంక్షోభం నుంచి బయటపడినట్లే. ఇప్పటికే ఆ దేశ ఖజానాలో నగదు నిల్వలు ఆరేళ్ళ కనిష్ఠానికి పడిపోయాయి.

అప్పు పరిమితి పెంచకపోతే అమెరికా డిఫాల్ట్ అయ్యే ప్రమాదం తలెత్తేది. కానీ ఇప్పుడు ఆ సమస్య నుంచి బయటపడింది. అప్పు పరిమితి పెంచక పోతే దేశంలో ఏకంగా 70 నుంచి 80 లక్షల ఉద్యోగాలు పోవటంతో పాటు పలు సమస్యలు చుట్టుముట్టేవి. ఇప్పటికే జర్మనీ మాంద్యంలోకి వెళ్లిన దశలో అమెరికా కూడా డిఫాల్ట్ అయితే ప్రపంచం మొత్తం మీద ఈ ప్రభావం పడేది. ఇప్పుడు అమెరికా అప్పు గండం నుంచి గట్టెక్కటంతో అందరూ ఒకింత ఊపిరి పీల్చుకున్నారు అని చెప్పొచ్చు.జూన్ 5 వరకు మాత్రమే ఖర్చులకు అమెరికా దగ్గర నగదు నిల్వలు ఉన్నాయి. కానీ చివరి నిమిషంలో జరిగిన డీల్ పెద్ద విపత్తు నుంచి తప్పించినట్లు అయింది అని చెపుతున్నారు.

Next Story
Share it