Telugu Gateway
Top Stories

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సంచలనం

ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సంచలనం
X

ఫేక్ డాక్టర్స్...ఫేక్ ఐఏఎస్ లు. ఇలా నిత్యం కొత్తగా ప్రజలను మోసం చేసే వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ సారి ఏకంగా ఒక యువకుడు సింగపూర్ ఎయిర్ లైన్స్ పైలట్ అవతారం ఎత్తాడు. సింగపూర్ ఎయిర్ లైన్స్ ప్రపంచంలోనే నంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది. అలాంటి సింగపూర్ ఎయిర్ లైన్స్ పైలట్ యూనిఫామ్ తో పాటు ఫేక్ ఐడి తో ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో సంచరిస్తూ కనిపించాడు. ఎయిర్ పోర్ట్ భద్రతను చూసే సిఐఎస్ఎఫ్ సిబ్బంది గమనించి అతడి దగ్గర ఉన్న వివరాలను పరిశీలించారు. అప్పుడు సింగపూర్ ఎయిర్ లైన్స్ పైలట్ యూనిఫామ్ తో పాటు ఐడి కార్డు కూడా ఫేక్ అని తేలింది. ఫేక్ పైలట్ అవతారం ఎత్తిన యువకుడు ఉత్తర ప్రదేశ్ లోని గౌతమ్ బుద్ధా నగర్ కు చెందిన సంగీత్ సింగ్ గా గుర్తించారు.

సంగీత్ సింగ్ తాను సింగపూర్ ఎయిర్ లైన్స్ లో పైలట్ గా పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులను కూడా నమ్మించాడు. ఇలా ఫేక్ ఐడి తో పట్టుబడిన వ్యక్తి 2020 సంవత్సరంలో ముంబై లో ఏడాది పాటు ఏవియేషన్ హాస్పిటాలిటీ కోర్స్ చేసినట్లు గుర్తించారు. ఢిల్లీ పోలీస్ లు సంగీత్ సింగ్ ను అరెస్ట్ చేసి వివిధ సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. పైలట్ యూనిఫామ్ ను ఢిల్లీ లోని ద్వారకా ప్రాంతం నుంచి తెప్పించుకున్నట్లు గుర్తించారు. గతంలో ఎన్నడూ లేని రీతిలో ఒక యువకుడు ఏకంగా ఫేక్ పైలట్ అవతారం ఎత్తి ఎయిర్ పోర్ట్ దగ్గర తచ్చాడటం కలకలం రేపింది అనే చెప్పాలి.

Next Story
Share it