ధర్మస్థలలో మరో షాకింగ్ ఘటన!

ధర్మస్థల. గత కొన్ని రోజులుగా దేశ వ్యాప్తంగా మారుమోగుతున్న పేరు ఇది. కర్ణాటకలోని అత్యంత పురాతనమైన మంజునాథ ఆలయం ఉండే ధర్మస్థల ప్రాంతం ఇప్పుడు పెద్ద వివాదానికి కేంద్ర బిందువుగా మారిన సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం ఒక పారిశుధ్య కార్మికుడు అక్కడ తాను వందకు పైగా..మహిళలు, యువతుల మృతదేహాలను ఖననం చేసినట్లు చెప్పటం పెద్ద సంచలనంగా మారింది. ఎప్పటి నుంచి ఇక్కడికి వచ్చిన యువతులు..మహిళలే కాకుండా కొంత మంది పురుషులు కూడా మిస్ అయినట్లు ఆరోపణలు ఉన్నాయి.. దీనికి సంబంధించి పోలీస్ స్టేషన్స్ లో కొన్ని కేసు లు కూడా నమోదు అయ్యాయి. కొన్ని సార్లు పోలీస్ లు కేసు లు నమోదు చేయటానికి కూడా ఏ మాత్రం అంగీకరించకుండా ఫిర్యాదు చేయటానికి వెళ్లిన వాళ్లనే బెదిరించి వెనక్కి పంపించారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. అదేంటి అంటే ధర్మస్థలిలో 15 సంవత్సరాలుగా నమోదు అయిన అసహజ మరణాల రికార్డు లు మాయం అయ్యాయి. ఇది ఇప్పుడు కలకలం రేపుతోంది. కర్ణాటక సర్కారు ఈ వ్యవహారంపై సిట్ తో సమగ్ర విచారణకు ఆదేశించే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్న తరుణంలో ఈ రికార్డు ల మాయం కీలకంగా మారింది.
సమాచార హక్కు చట్టం కార్యకర్త ఒకరు ఈ రికార్డు ల మాయం విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. బెళతంగుడి పోలీసులు ఒక పద్ధతి ప్రకారం 2000 -2015 సంవత్సరాల మధ్య చోటు చేసుకున్న అసహజ మరణాల రికార్డు లను తొలగించినట్లు చెపుతున్నారు. ఇక్కడ కీలక విషయం ఏమిటి అంటే ఈ సమయంలో ఎక్కువ అనుమానాస్పద మరణాలు ఆ ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు చెపుతున్నారు. ఆర్ టిఐ కార్యకర్త జయంత్ సిట్ కు ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. ఒక యువతి మృత దేహాన్ని అక్రమంగా పాతిపెట్టడం తాను చూశానని...అక్కడే అధికారులు కూడా ఉన్నారు అని ఆయన చెపుతున్నారు. ఇప్పుడు అక్కడ మృతదేహాన్ని వెలికితీయాల్సి ఉంది. జయంత్ గత కొంతకాలంగా ఆర్ టిఐ ని ఉపయోగించుకుని ఆచూకీ గల్లంతు అయిన వ్యక్తులు..వారి ఫోటోలను పోలీస్ అధికారులను అడగ్గా ...వాళ్ళు తమ దగ్గర ఉన్న సమాచారం అంటే వాల్ పోస్టర్లు...పోస్టుమార్టుమ్ రిపోర్టులు...నోటీసులు..ఫోటో గ్రాఫ్ లు పరిపాలనాపరమైన ఆదేశాల మేరకు వాటిని నాశనం చేసినట్లు పోలీసులు వెల్లడించారన్నారు. మరి ఈ వ్యవహారంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.



