దుబాయ్ దూకుడు..ఆరు నెలల్లో 2.70 కోట్ల మంది ప్రయాణికులు
నవంబర్, డిసెంబర్ ల్లో ఖతార్ ఫిఫా వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇస్తున్నందున పర్యాటకుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత బిజీ విమానాశ్రయాల్లో దుబాయ్ ఒకటి. ఈ విమానాశ్రయం 2022 సంవత్సరం తొలి ఆరు నెలల కాలంలో 27.8 మిలియన్ల (2.70 కోట్ల) ప్రయాణికులను హ్యాండిల్ చేసింది. 2021 సంవత్సరం కంటే ఇది ఏకంగా 160 శాతం అధికం కావటం విశేషం. యూఏఈలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా సాగటంతోపాటు..ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కేసులు గణనీయంగా తగ్గటంతో అంతర్జాతీయ విమాన ప్రయాణికుల సంఖ్య కూడా కోవిడ్ పూర్వస్థితికి చేరుకుంటోంది.