Telugu Gateway
Top Stories

విమానం టేకాఫ్ కు ముందు పైలట్ అరెస్ట్

విమానం టేకాఫ్ కు ముందు పైలట్ అరెస్ట్
X

నిజంగా ఆ ప్రయాణికులు అదృష్టవంతులు. భద్రతా అధికారులు సరిగా గమనించకపోయి ఉంటే 267 మంది ప్రయాణికుల ప్రాణాలు గాలిలో ఉగిసలాడేవి. విషయం గమనించి సరిగ్గా ఆ పైలట్ విమానాన్ని టేకాఫ్ చేయటానికి వెళుతున్న సమయంలో అతని కళ్ళు ఎర్రగా ఉండటం, ఆ పైలట్ తూలుతూ నడుస్తుండటం గమనించారు. వెంటనే ఆల్కహాల్ టెస్ట్ నిర్వహించగా నిబంధలు కంటే ఆరు రేట్లు అధికస్థాయిలో అయన బాడీ లో ఆల్కహాల్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఇంత నిర్లక్ష్యంగా విధులకు వచ్చిన పైలట్ ను అరెస్ట్ చేశారు. దీంతో ఆ విమానం కూడా రద్దు అయింది. పారిస్ నుంచి వాషింగ్టన్ బయలుదేరిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ లో ఈ ఘటన చోటు చేసుకుంది.

అరెస్ట్ అనంతరం పోలీస్ లు పైలట్ ను విచారించగా ముందు రోజు రాత్రి తాను రెండు గ్లాస్ ల మద్యం సేవించినట్లు అంగీకరించాడు. కోర్ట్ ముందు కూడా ఈ విషయాన్నీ ఒప్పుకోవటం తో ...ఒక అదే పరిస్థితిలో విమానం నడిపి ఉంటే 267 మంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడేవి అని జడ్జి వ్యాఖ్యానించారు. పైలట్ కు ఆరు నెలల జైలు శిక్షతో పాటు ఐదు వేల డాలర్ల జరిమానా కూడా విధించారు. ఈ ఘటనపై స్పందించిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ ఆ పైలట్ ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. విచారణ అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నట్లు తెలిపింది.

Next Story
Share it