Telugu Gateway
Top Stories

గ్రామీణ..పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిరుద్యోగం

గ్రామీణ..పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న నిరుద్యోగం
X

కరోనా కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు కోల్పోతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఒక్క వారం రోజుల్లోనే గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం రెట్టింపు అయింది. మే 9 నాటికి గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం 7.29 శాతం ఉండగా..ఇప్పుడు అది ఏకంగా 14.34 శాతానికి పెరిగింది. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) ఈ గణాంకాలను వెల్లడించింది. ఏడాది కాలంలో కూడా ఇదే అత్యధికం అని పేర్కొన్నారు. దేశాన్ని రెండవ దశ కరోనా కుదిపేస్తుండటంతో కీలక రాష్ట్రాలు అన్నీ లాక డౌన్ దిశగా పయనించాయి.

దీంతో చాలా మంది తాత్కాలిక పని వాళ్లకు కూడా ఉపాధి లేకుండా పోయింది. గ్రామీణ ప్రాంతాల్లోనే కాకుండా పట్టణ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగం 8.67 శాతం నుంచి 14.45 శాతానికి పెరిగింది. లాక్ డౌన్లు..కర్ప్యూలు కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని అంచనా వేశారు. ఈ సారి గ్రామీణ ప్రాంతాలకు కూడా వైరస్ పెద్దగా వ్యాప్తి చెందటం మరింత ప్రమాదకరంగా మారిందని అన్నారు. దీంతో ఎంఎస్ఎంఈ రంగంపై కూడా ప్రభావం పడిందని తెలిపారు.

Next Story
Share it