Telugu Gateway
Top Stories

దుబాయ్ కి ఇక ఐదేళ్ల వీసాలు!

దుబాయ్ కి ఇక ఐదేళ్ల వీసాలు!
X

దుబాయ్ ప్రేమికుల‌కు శుభ‌వార్త‌. యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఐదేళ్ళ పాటు చెల్లుబాటు అయ్యేలా బ‌హుళ‌-ప్రవేశ పర్యాటక వీసాలు మంజూరు చేయ‌బోతుంది. ఈ దిశ‌గా వేగం అడుగులు వేస్తోంది. భార‌త్ నుంచి దుబాయ్ వెళ్లాల‌నుకునే ప‌ర్యాట‌కుల‌కు కేవ‌లం 30 రోజులు లేదా 90 రోజులు మాత్ర‌మే చెల్లుబాటు అయ్యేలా వీసాలు ఇస్తున్నారు. అనుమ‌తి ఉన్న ఏజెంట్ల ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకుంటే 72 గంట‌ల్లోనే దుబాయ్ వీసా ప్రాసెస్ అవుతుంది. త్వ‌ర‌లోనే ఐదేళ్ల పాటు చెల్లుబాటు అయ్యేలా..ఆ స‌మ‌యంలో ఎన్నిసార్లు అయినా యూఏఈ దేశాల‌ను సంద‌ర్శించే వెసులుబాటు ద‌క్క‌నుంది. ఈ ఏడాది తొలి ఆరు నెల‌ల కాలంలోనే భార‌త్ నుంచి దుబాయ్ కు భారీ ఎత్తున ప‌ర్యాట‌కులు వెళ్లారు. దీన్ని గ‌మ‌నంలోకి తీసుకునే త్వ‌ర‌లో ఐదేళ్ల వీసాను తీసుకురానున్నారు. భార‌త ప‌ర్యాటకుల‌ను పెద్ద ఎత్తున ఆక‌ట్టుకునేందుకే యూఏఈ ఈ నిర్ణ‌యం తీసుకోనుంద‌ని అధికార వ‌ర్గాలు చెబుతున్నాయి.

దుబాయ్ లో ప్ర‌పంచంలోనే ఎంతో పేరుగాంచిన ప్ర‌ముఖ ప‌ర్యాట‌క ప్రాంతాలు ఉండ‌టంతో పాటు ప్ర‌పంచంలోని ఎంతో అడ్వాన్ డ్ న‌గ‌రాల్లో ఇది ఒక‌టి అన్న విష‌యం తెలిసిందే. అంతే కాదు..ప్ర‌పంచంలోనే సంప‌న్నుల‌కు దుబాయ్ లో షాపింగ్ చేయ‌టం అంటే అదో క్రేజ్. ఈ ఏడాది దుబాయ్ లో ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుండ‌టం కూడా ఓ ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా మార‌బోతుంది. న‌వంబ‌ర్ లో ఖ‌తార్ లో ఇది ప్రారంభం కానుంది. దుబాయ్ నుంచి ఖ‌తార్ కు రోడ్డు మార్గంలో వెళ్ళాలంటే కేవ‌లం ఏడు గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ప‌డుతుంది. ప‌ర్యాట‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌టానికి ఇది కూడా ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని యూఏఈ భావిస్తోంది. మ‌రో కీల‌క విష‌యం ఏమిటంటే దుబాయ్ కు చెందిన ప్ర‌ముఖ ఎయిర్ లైన్స్ ఎమిరేట్స్ అక్టోబ‌ర్ 30 నుంచి దేశ ఐటి రాజ‌ధాని బెంగుళూరు నుంచి దుబాయ్ కు ఏ380 విమాన స‌ర్వీసుల‌ను న‌డ‌ప‌నుంది. ప్రపంచంలోనే అతిపెద్ద‌దైన ఈ డ‌బుల్ డెక్క‌ర్ విమాన స‌ర్వీసుల‌తో భార‌త్ నుంచి దుబాయ్ కు వెళ్లే ప‌ర్యాట‌కుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు.

Next Story
Share it