ఇద్దరు పైలట్లు నిద్రపోయారు..ల్యాండింగ్ కూడా మర్చిపోయారు

దిగాల్సిన ప్రాంతం కంటే ఈ విమానం ఎక్కువ దూరం ప్రయాణిస్తుండటంతో ఏటీసీ సిబ్బంది కూడా పైలట్లను కాంటాక్ట్ చేసేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే ఆటోపైలట్ డిస్ కనెక్ట్ అయి అలారం మోగటంతో వీరు మేల్కొన్నారని ఏవియేషన్ హెరాల్డ్ వెల్లడించింది. అలారం మోగిన తర్వాత నిద్రలేచిన పైలట్లు ఇద్దరూ విమానాన్ని సేఫ్ గా ల్యాండ్ చేయటంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన ఇప్పుడు పెద్ద సంచలనంగా మారింది.



