Telugu Gateway
Top Stories

ట్విట్ట‌ర్ సీఈవోకు ఏటా 7.5 కోట్ల వేత‌నం

ట్విట్ట‌ర్ సీఈవోకు ఏటా 7.5 కోట్ల వేత‌నం
X

పరాగ్ అగ‌ర్వాల్. ఇప్పుడే ఈ పేరు మారుమోగిపోతోంది. తాజాగా ఆయ‌న ట్విట్ట‌ర్ సీఈవోగా నియ‌మితులు కావ‌ట‌మే దీనికి కార‌ణం. జాక్ డోర్సే ఈ ప‌ద‌వి నుంచి త‌ప్పుకుని..ఈ బాధ్య‌త‌ల‌ను ఆయ‌న‌కు అప్ప‌గించారు. దీంతో ఇప్పుడు ప‌రాగ్ అగ‌ర్వాల్ కు సంబంధించిన ప్ర‌తి వార్త ఆస‌క్తిక‌రంగా మారింది. కొత్త సీఈవో నియామ‌కంతోపాటు ఆయ‌న‌కు అంద‌జేస్తున్న వేత‌నం త‌దిత‌ర వివ‌రాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. ట్విట్ట‌ర్ నాస్ డాక్ లో లిస్ట్ అయిన కంపెనీ కాబ‌ట్టి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ క‌మిష‌న్ కు విధిగా ఈ వివ‌రాలు తెలియ‌జేయాల్సి ఉంటుంది కంపెనీ. కంపెనీ ఎక్స్చేంజ్ కు ఇచ్చిన స‌మాచారం ప్ర్ర‌కారం ప్ర‌కారం ఆయ‌న‌కు ఏటా ఒక మిలియ‌న్ అంటే భార‌తీయ క‌రెన్సీలో చూస్తే 7.50 కోట్ల రూపాయ‌ల వేత‌నం అంద‌నుంది.

దీంతోపాటు బోన‌స్, 12.5 మిలియ‌న్ల విలువ చేసే స్టాక్స్ కూడా ఇస్తారు. అయితే వీటిని ద‌శ‌ల వారీగా కేటాయిస్తారు. వీటిపై కూడా ప‌లు ప‌రిమితులు ఉంటాయి. 38 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉన్న ప‌రాగ్ అగ‌ర్వాల్ అతి చిన్న వ‌య‌స్సులో సీఈవోగా నియ‌మితులైనట్లు స‌మాచారం. ఐఐటి బాంబేలో గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన ప‌రాగ్.. ఆ త‌ర్వాత క్యాలిపోర్నియాలోని స్టాన్ ఫోర్డ్ యూనివ‌ర్శిటీలో మాస్ట‌ర్స్ తోపాటు పీహెచ్ డీ చేశారు. ప‌రాగ్ 2011లో ట్విట్ట‌ర్ లో జాయిన్ అయ్యారు. ప‌లు హోదాల్లో ప‌నిచేసిన ఆయ‌న ఇప్పుడు సీఈవోగా నియ‌మితుల‌య్యారు.

Next Story
Share it