కంటెంట్ పై ఇక బాధ్యత అంతా ట్విట్టర్ దే
కేంద్ర ప్రభుత్వం ట్విట్టర్ విషయంలో కఠినంగానే ముందుకెళుతోంది. ఇప్పటికే పార్లమెంటరీ కమిటీ నోటీసులు జారీ చేయగా..తాజాగా మరిన్ని చర్యలకు దిగింది. ఇక నుంచి ట్విట్టర్ లో వచ్చే సమాచారం అంతటికీ ఆ సంస్థే బాధ్యత వహించాల్సి ఉంటుందని..ఇక నుంచి ట్విట్టర్ కు మధ్యవర్తిభావాలు పంచుకునే హోదా ఉండదని కేంద్ర ఐటి, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. దేశంలో ఐటి చట్టాల అమలుకు ట్విట్టర్ ఇంత వరకూ చర్యలు తీసుకోకపోవటంతో ఈ మేరకు చర్యలు చేపట్టారు. గత కొన్ని రోజులుగా నూతన చట్టాలపై మోడీ సర్కారు, ట్విట్టర్ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఇది పతాకస్థాయికి చేరింది.
ఇక నుంచి ట్విట్టర్ లో వచ్చే సమాచారం అంతా ' పబ్లిషర్ స గా ట్విట్టరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ట్విట్టర్ యూజర్లు చేసే ట్వీట్స్ మొత్తం సదరు పబ్లిషర్ ప్రచురించే ' ఎడిటోరియల్ ' గా భావించి ఆ ట్వీట్స్ లో భారత చట్టాల పరిధిలో ( ఐటి చట్టలతో సహా ) ఏదైనా అభ్యంతరకర ' ఎడిటోరియల్ ' వాఖ్యలూ..కంటెంట్ ఉంటే భారత చట్టాల ప్రకారం నేరుగా ట్విటర్ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. మరి ఈ అంశంపై ట్విట్టర్ ఎలా స్పందిస్తుందో వేచిచూడాల్సిందే.