ట్విట్టర్ లో తీవ్ర సంక్షోభం
ఎలాన్ మస్క్ దెబ్బకు ప్రముఖ మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ అతలాకుతలం అవుతోంది. నిన్న మొన్నటి వరకు ఉద్యోగులకు వరసగా మస్క్ షాక్ లు ఇస్తూ వచ్చారు. ఇప్పుడు ఆయనకు రివర్స్ షాక్ తగిలింది. ఎలాన్ మస్క్ నిర్ణయాలతో ఉద్యోగలు వరసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. దీంతో మొత్తం ట్విట్టర్ తీవ్ర సంక్షోభంలో కూరుకున్నట్లు అవుతోంది. ఉద్యోగుల దెబ్బకు ట్విట్టర్ పలు ఆఫీసులు మూసివేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటిని తిరిగి నవంబర్ 21 నుంచి తిరిగి ప్రారంభిస్తాం అని ప్రకటించారు. పెద్ద ఎత్తున ఉద్య్యోగుల రాజీనామా చేస్తుండటంతో మొత్తం మీద కంపెనీలో 2000 మంది మాత్రమే మిగిలే అవకాశం ఉందని సమాచారం. ట్విట్టర్ వంటి పెద్ద కంపెనీ దక్కించుకున్న తర్వాత పరిస్థితిని పూర్తిగా మదింపు చేసి నిర్ణయాలు తీసుకోవాలి. కానీ ఎలాన్ మస్క్ మాత్రం వస్తూ వస్తూనే సీఈఓ దగ్గర నుంచి కీలక స్థానాల్లో ఉన్నవారి అందరి పై వేటు వేశారు. ఇదే ఇప్పుడు అయన కొంప ముంచుతోంది. ఈ వ్యవహారం రాబోయే రోజుల్లో ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాల్సిందే. వందల సంఖ్యలో రాజీనామాలకు మాత్రం ఎలాన్ మస్క్ పంపిన మెయిల్ కారణం అని ఉద్యోగులు చెపుతున్నారు. తాజా పరిణామాలతో మస్క్ కొంత వెనక్కి తగ్గి లేఖ రాసినట్లు చెపుతున్నారు.