నలభై కోట్ల ట్విట్టర్ యూజర్ల డేటా లీక్!

నలభై కోట్ల మంది ట్విట్టర్ యూజర్ల డేటా కొట్టేసి దాన్నే కొనుక్కోమంటున్నాడు. అంతే కాదు..ఇది బయటి వ్యక్తుల చేతిలోకి వెళితే విచారణ ఎదుర్కోవటంతో పాటు...భారీ ఎత్తున నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది కాబట్టి తన దగ్గర ఇది కొనుక్కువటమే బెటర్ అంటూ ఆఫర్ ఇచ్చాడు. ఇందుకు ఎలాన్ మస్క్ ముందుకు వస్తే మాత్రం తాను ఈ డేటా ను మళ్ళీ ఎక్కడ..మరో వ్యక్తికి విక్రయించానని చెపుతున్నారు. మరి ఈ హ్యాకర్ విసిరినా సవాల్ కు ట్విట్టర్ఎ అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తారా..హ్యాకర్ కోరిన మొత్తం చెల్లిస్తారా అన్నది ఇప్పుడు అత్యంత కీలకం కానుంది. అయితే తన దగ్గర ఉన్న 40 కోట్ల యూజర్ల డేటా పక్కా నిజమైనది అని నిరూపించటానికి వీలుగా కీలక వ్యక్తుల వివరాలు కూడా కొన్ని శాంపిల్ గా సోషల్ మీడియా లో షేర్ చేశాడు ఈ హ్యాకర్. అందులో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ , బాలీవుడ్ కు చెందిన ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ ల వివరాలు ఉన్నాయి. . వీళ్ళే కాదు..చాలా మంది హై ప్రొఫైల్ వ్యక్తుల సమాచారం తన దగ్గర ఉందని హ్యాకర్ స్పష్టం చేస్తున్నాడు.
ఇందులో అత్యంత కీలకమైన ఈ మెయిల్స్, ఫోన్ నంబర్లు ఉన్నాయి. 40 కోట్ల ట్విట్టర్ యూజర్ల కొట్టేసి దీని డార్క్ నెట్ లో అమ్మకానికి పెట్టాడు. ట్విట్టర్ చరిత్రలో ఇదే అతి పెద్ద డేటా చౌర్యంగా భావిస్తున్నారు. గతంలో ఒకసారి 54 లక్షల మంది ట్విట్టర్ యూజర్ల డేటా లీక్ అయిన ఘటనపై విచారణ చేయనున్నట్లు ఐరిష్ డేటా ప్రొటెక్షన్ కమిషన్ (డీపీసీ) ప్రకటించిన మరుసటి రోజే 40 కోట్ల డేటా లీక్ విషయం బయటకు రావటం ప్రాధాన్యత సంతరించుకుంది.నవంబర్ లోనే 54 లక్షల మంది డేటా లీక్ అయినట్లు గుర్తించారు. జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్ (జీడీపీఆర్ ) జరిమానా తప్పించుకోవాలంటే ట్విట్టర్ లేదా ఎలాన్ మస్క్ దీన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశాడు హ్యాకర్.మధ్యవర్తి తో ఈ అంశంపై డీల్ చేసుకోవటాని తాను సిద్ధం అంటూ పోస్ట్ పెట్టారు. డీల్ ఒక అయ్యాక థ్రెడ్ ను డిలీట్ చేస్తానని..దాన్ని ఎవరికి అమ్మను అని హామీ ఇచ్చారు. గతంలో ఇలాగే 533 మిలియన్ల యూజర్ల డేటా ను పేస్ బుక్ నుంచి కొట్టేయటంతో...మెటా కంపెనీ దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది.



