Telugu Gateway
Top Stories

ట్విట్టర్ పై ట్రంప్ ఫైర్

ట్విట్టర్ పై ట్రంప్ ఫైర్
X

ట్విట్టర్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతాను శాశ్వతంగా తొలగించింది. ఆయన రాబోయే రోజుల్లో రెచ్చగొట్టే ప్రకటనలు చేసే అవకాశం ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలుమార్లు ట్రంప్ నిబంధనలు ఉల్లంఘించినట్లు పేర్కొంది. అయితే ట్విట్టర్ తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది తమ గొంతు నొక్కలేదని..భావవ్యక్తీకరణను అడ్డుకోలేదని ఆగ్రహించారు. తాను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వస్తానని..దీని కోసం ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. నూతన ప్రెసిడెంట్‌గా ఎంపికైన జో బైడెన్‌ ప్రమాణ స్వీకారం తదితర సమయాలలోనూ ఆన్‌లైన్‌ ద్వారా మరోసారి నిరసనలను ప్రోత్సహించే అవకాశముండటంతో తాజా నిర్ణయాన్ని తీసుకున్నట్లు సుదీర్ఘ వివరణను ఇచ్చింది. చాలకాలంగా ట్రంప్‌సహా వివిధ ప్రపంచ నేతలకు నిబంధనలలో కొంతమేర మినహాయింపులను అమలు చేస్తున్నట్లు ట్విటర్‌ ఈ సందర్భంగా వెల్లడించింది.

వ్యక్తిగత దూషణలు(దాడులు), హేట్‌ స్పీచ్‌ తదితర విషయాలలో ప్రపంచ నేతలకు నిబంధనలనుంచి మినహాయింపులను ఇస్తున్నట్లు తెలియజేసింది. క్యాపిటల్‌ బిల్డింగ్‌ వద్ద బుధవారం జరిగిన హింసాత్మక ఘటనల తదుపరి సోషల్‌ మీడియా దిగ్గజాలపై ఒత్తిడి పెరుగుతూ వచ్చింది. ఓవైపు ఫేస్‌బుక్‌ తాత్కాలికంగా ట్రంప్‌ ఖాతాను ఈ నెల 20వరకూ నిలిపివేయగా.. ట్విటర్‌ సైతం తొలుత 12 గంటలపాటు ట్రంప్‌ ఖాతాకు చెక్‌ పెట్టిన సంగతి తెలిసిందే. తాజా ఒత్తిళ్ల నేపథ్యంలో ట్రంప్‌ ఖాతాను ట్విటర్‌ శాశ్వతంగా నిషేధించేందుకు నిర్ణయించగా.. ఫేస్‌బుక్ సైతం ఇదే బాటలో నడిచే వీలున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Next Story
Share it