Telugu Gateway
Top Stories

టీవీ9తో ఎలుగుబంటి ఏమి మాట్లాడింది?

టీవీ9తో ఎలుగుబంటి ఏమి మాట్లాడింది?
X

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఫోటో

టీవీ9. నిన్న మొన్న‌టి వ‌ర‌కూ తెలుగులో నెంబ‌ర్ వ‌న్ ఛాన‌ల్. ఇప్పుడు ఆ స్థానాన్ని పొగొట్టుకుంది. 24 గంట‌ల వార్త‌లు చెప్పే ఛాన‌ల్ నిత్యం ఏదో ఒక వివాదంలో వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటుంది. విమ‌ర్శ‌లు ఎన్ని వ‌చ్చినా మాకెంటి సంబంధం అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తారు. తాజాగా టీవీ9కు సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటుచేసుకుంది. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఎలుగుబంటి హ‌ల్ చ‌ల్ చేసింది. గ్రామ‌స్తుల‌ను ఇబ్బంది పెట్టింది. అట‌వీ సిబ్బంది ఎట్ట‌కేల‌కు దాన్ని ప‌ట్టుకున్నారు. దీనికి సంబంధించి ఓ పేద్ద వార్త‌నే ప్ర‌సారం చేసింది ఛాన‌ల్. లైవ్ క‌వ‌రేజ్. ఇందులో పెద్ద‌గా త‌ప్పుప‌ట్టాల్సింది ఏమీ లేకోపోయినా అట‌వీ శాఖ అధికారులు దానికి మ‌త్తు మందు ఇచ్చిన త‌ర్వాత టీవీ9 చాన‌ల్ రిపోర్ట్ ఎలుగు బంటి మూతి ముందు మైక్ పెట్టారు.

మొత్తం ఎపిసోడ్ లో హైలెట్ స‌న్నివేశం. అస‌లు ఎలుగుబంటి హంగామా కంటే ఈ క్లిప్పింగే ఇప్పుడు పెద్ద సంచ‌ల‌నంగా మారింది. సోస‌ల్ మీడియాలో మ‌రోసారి ఈ వ్య‌వ‌హారంపై నెటిజ‌న్లు ఆడుకుంటున్నారు. అయితే ఏంటి టీవీ9కు ఇది అల‌వాటే. ఇలాంటివి ఎన్ని చూశాం లే అనుకుంటారేమో. స‌హజంగా కొంత మంది టీవీ రిపోర్ట‌ర్లు ప్ర‌మాదాల బారిన ప‌డిన వారి ద‌గ్గ‌ర కూడా వారి ప‌రిస్థితి ప‌ట్టించుకోకుండా మైకులు పెడుతుంటారు. దీనిపై కూడా పెద్ద ఎత్తున విమర్శ‌లు వ‌చ్చేవి. ఇప్పుడు ఏకంగా ఎలుగుబంటి మూతి ముందు మైకు పెట్ట‌డం ఏదైతే ఉందో...అట్లుంట‌ది..టీవీ9తో మ‌రి అన్న‌ట్లు ఉంది.

Next Story
Share it