Telugu Gateway

నిర్ణయం మీరు తీసుకొంటారా..మమ్మల్ని తీసుకోమంటారా?

నిర్ణయం మీరు తీసుకొంటారా..మమ్మల్ని తీసుకోమంటారా?
X

తెలంగాణ సర్కారుకు 48 గంటల గడువు ఇచ్చిన హైకోర్టు

తెలంగాణ సర్కారుకు హైకోర్టు 48 గంటల సమయం ఇచ్చింది. కర్ప్యూ, లేదా వీకెండ్ లాక్ డౌన్ లపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుందా? లేక తామే ఆదేశాలు జారీ చేయాలా అని ప్రశ్నించింది. ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర సరిహద్దుల్లో కరోనా టెస్ట్ లు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేసింది. సోమవారం ఉదయమే కరోనా అంశంపై విచారణ జరిగిన హైకోర్టు సర్కారు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా కేసులు పెరుగుతున్న జన సంచారం తగ్గించేందుకు ఎందుకు చర్యలు తీసుకోవటంలేదని ప్రశ్నించింది.

ప్రజల ప్రాణాలు పోతుంటే ప్రభుత్వానికి మద్యం దుకాణాలు, బార్లే ముఖ్యమా అని ప్రశ్నించింది. జీహెచ్ఎంసీలో నమోదు అయిన కేసుల వివరాలు వార్డుల వారీగా కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. డీజీపీ, ఆరోగ్య శాఖ ఇచ్చిన నివేదికలు సమగ్రంగా లేవన్నారు. ఆస్పత్రుల్లో సలహాల కోసం నోడల్ అధికారులను కూడా నియమించాలన్నారు. పెళ్లిళ్ళు, ఇతర శుభకార్యాల్లో ఎక్కువ మంది పాల్గొంటే చర్యలు తీసుకోవాలన్నారు.

Next Story
Share it