Telugu Gateway
Top Stories

ట్రంప్ ప్రకటన.. వైట్ హౌస్ క్లారిటీ

ట్రంప్ ప్రకటన.. వైట్ హౌస్ క్లారిటీ
X

ఒక్క ప్రకటన తో ఐటి రంగంలో కల్లోలం రేపిన అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ సర్కారు హెచ్ 1 బీ వీసాల విషయంలో ఒకింత క్లారిటీ ఇచ్చింది. ఇందులో అత్యంత కీలకమైనది లక్ష డాలర్లు ఫీజు ఏడాదికి కాదు...ఈ వీసా కోసం అప్లై చేసే సమయంలో ఒక్కసారి చెల్లించాల్సిన మొత్తం అని వెల్లడించింది. హెచ్ 1 వీసా ఉండి అమెరికా వెలుపల ఉన్న వాళ్ళు దేశంలోకి ప్రవేశించే సమయంలో లక్ష డాలర్లు చెల్లించాల్సిన అవసరం ఉండదు అని స్పష్టం చేశారు. ఇప్పటికే హెచ్ 1 వీసా ఉన్న వాళ్ళు గతంలో లాగానే దేశాన్ని వీడి మళ్ళీ తిరిగిరావొచ్చు అని..ఇందులో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తాజాగా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన కారణంగా వీళ్లకు ఎలాంటి సమస్యలు రావు. లక్ష డాలర్ల ఫీజు కేవలం కొత్త దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది అని...రెన్యూవల్స్, ప్రస్తుత వీసా హోల్డర్లకు కాదు అని తెలిపారు. ఇది తొలుత వచ్చే లాటరీ సైకిల్ నుంచి అమల్లోకి వస్తుంది అని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ స్పష్టత ఇచ్చారు. డోనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన ప్రకటన కారణంగా అమెరికా వెలుపల ఉన్న హెచ్ 1 వీసా దారులు అంతా కూడా సెప్టెంబర్ 21 లోకి దేశంలోకి తిరిగి ప్రవేశించాలని దిగ్గజ కంపెనీలు అయిన మైక్రోసాఫ్ట్, మెటా, అమెజాన్ వంటి కంపెనీలు తమ ఉద్యోగులకు అంతర్గత మెయిల్స్ పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

అదే సమయంలో హెచ్ 1 బీ వీసా కోసం లక్ష డాలర్ల ఫీజు కారణంగా అటు అమెరికా కంపెనీలతో పాటు దేశీయ ఐటి కంపెనీలు ...ముఖ్యంగా స్టార్ట్ అప్ లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు అనే అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు వైట్ హౌస్ ఈ అంశంపై క్లారిటీ ఇవ్వటంతో గందరగోళానికి కొంత మేర తెర దించినట్లు అయింది అనే చెప్పొచ్చు. అయితే కొత్తవాళ్లు దరఖాస్తు సమయంలోనే వన్ టైం కింద అయినా కూడా లక్ష డాలర్లు కట్టాలంటే కంపెనీలు ఎంత మేర ఆసక్తిచూపుతాయి అనేది సందేహమే. అయితే ముందు వచ్చిన వార్తల ప్రకారం ఏడాదికి లక్ష డాలర్లు కట్టాలనే ప్రతిపాదనతో పోలిస్తే కొంతలో కొంత ఇది ఊరట కలిపించే నిర్ణయమని చెప్పొచ్చు.

Next Story
Share it