Telugu Gateway
Top Stories

త్వరలోనే యుద్దానికి ముగింపు

త్వరలోనే యుద్దానికి ముగింపు
X

అమెరికా-ఇజ్రాయెల్ లు ఇరాన్ పై ఉమ్మడిగా చేస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు అగ్రరాజ్యంపై గుర్రుగా ఉన్నాయి. ఈ యుద్ధంతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా కూడా యూఏఈ భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చింది. ఫిబ్రవరి 28 న ఇరాన్ పై యుద్ధం మొదలైనప్పటి నుంచి దుబాయ్ తో పాటు పలు దేశాల్లో విమాన సర్వీస్ లు పూర్తిగా నిలిచిపోయాయి. అంతర్జాతీయ ప్రయాణాలకు దుబాయ్ విమానాశ్రయం కీలక హబ్ గా ఉన్న విషయం తెలిసిందే. పలు దేశాలు ఎయిర్ స్పేస్ ను మూసి వేయటంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దుబాయ్ తో పాటు పలు దేశాల నుంచి కేవలం ఎంపిక చేసిన సర్వీస్ లు నడిచాయి తప్ప...షెడ్యూల్ సర్వీస్ లు పూర్తిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ యుద్ధం కారణంగా ముడి చమురు ధరలు పెరిగి ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్ లు కుప్పకూలాయి.

ఈ తరుణంలో ఇరాన్ పై యుద్ధం విషయంలో అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఇరాన్ విషయంలో తాము అన్ని లక్ష్యాలను సాధించామని చెప్పారు. ఇప్పుడు ఇక ఇరాన్ దగ్గర ఏమి లేదు అన్నారు. తాను ఎప్పుడు అనుకుంటే అప్పుడే యుద్ధం ఆగుతుంది...త్వరలోనే ఈ యుద్దాన్ని ముగిస్తామన్నారు. ఒక మీడియా కు ఇచ్చిన టెలిఫోనిక్ ఇంటర్వ్యూ లో డోనాల్డ్ ట్రంప్ యుద్ధం పై ఈ వ్యాఖ్యలు చేశారు. ఊహించిన దాని కన్నా అమెరికా సేనలు తమ లక్ష్యాన్ని పూర్తి చేశాయి అని డోనాల్డ్ ట్రంప్ చెప్పారు. తమ ప్రణాళిక కన్నా ఏందో ముందు ఉన్నట్లు వెల్లడించారు. తాజాగా డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన ప్రకారం చూస్తే ఇరాన్ పై యుద్ధం ఏ క్షణంలో అయినా ఆగిపోవచ్చు అనే అంచనాలు వెలువడుతున్నాయి. అదే జరిగితే ప్రపంచానికి పెద్ద రిలీఫ్ దొరికినట్లే అని చెప్పొచ్చు. అయితే ఇరాన్ డోనాల్డ్ ట్రంప్ ప్రకటనపై ఎలా స్పందిస్తుందో చూడాలి.

.

Next Story
Share it