Telugu Gateway
Top Stories

విదేశీ విద్యార్థుల ప్రవేశలకు నో!

విదేశీ విద్యార్థుల ప్రవేశలకు నో!
X

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ మొదటికొచ్చారు. సుంకాల విషయంతో పాటు యూనివర్శిటీల ను కూడా టార్గెట్ చేస్తున్నారు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఐదు యూనివర్సిటీ ల్లో ఒకటిగా ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీ ని టార్గెట్ చేశారు. దీంతో ఇప్పుడు ఇందులో చదువుతున్న వేలాది మంది విదేశీ విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారబోతుంది. అయితే ట్రంప్ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని కోర్టు లో సవాల్ చేసేందుకు రెడీ అవుతోంది. ఈ వ్యవహారం ఎన్ని మలుపులు తీసుకుంటుందో తెలియాలి అంటే కొన్ని రోజులు గడవాల్సిందే. త్రయంపి సర్కారు తాజాగా హార్వర్డ్ యూనివర్సిటీ లో విదేశీ విద్యార్థుల ప్రవేశాలకు అనుమతి రద్దు చేసింది. దీంతో వేలాది విదేశీ విద్యార్థులు చిక్కుల్లో పడబోతున్నారు. ఇందులో భారతదేశం నుంచి వచ్చిన వందలాది మంది విద్యార్థులు అనిశ్చితిలో పడిపోయారు. ఈ విద్యార్థుల ముందు ఇప్పుడు రెండు ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి యూనివర్శిటీ మారటం. లేదు అంటే చట్టపరమైన హక్కును కోల్పోవడం. అయితే హార్వర్డ్ యూనివర్శిటీ కి ట్రంప్ నిర్ణయంపై కోర్టు లో ఊరట లభిస్తే తప్ప విద్యార్థులు సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ప్రస్తుతం హార్వర్డ్ యూనివర్శిటీ లో 788 మంది ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయంలో మొత్తం 6,800 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. వీరిలో అత్యధికంగా గ్రాడ్యుయేట్ చేస్తున్నారు. అయితే తమ ఆదేశాల విషయంలో వెనక్కు తగ్గాలంటే తాము అడిగిన అన్ని డాక్యుమెంట్స్ యూనివర్శిటీ ప్రభుత్వానికి ఇవ్వాలని చెపుతున్నారు. అయితే హార్వర్డ్ విశ్వవిద్యాలయం తమ విదేశీ విద్యార్థుల రికార్డులను సమర్పించడానికి నిరాకరించినట్లు చెపుతున్నారు. ఈ చర్య చట్టవిరుద్ధమని, తమ పరిశోధనా లక్ష్యాలను దెబ్బతీస్తుందని హార్వర్డ్ చెపుతోంది. అమెరికా ప్రభుత్వానికి దేశంలోకి ఎవరు ప్రవేశించాలనే విషయంపై నిర్ణయించే అధికారం ఉంది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, స్టూడెంట్ ఎక్స్‌ఛేంజ్ అండ్ విజిటర్ ప్రోగ్రామ్ (SEVP)లో భాగమైన కళాశాలలను పర్యవేక్షిస్తుంది. ఈ ప్రోగ్రామ్ ద్వారా విశ్వవిద్యాలయాలు విదేశీ విద్యార్థులకు అడ్మిషన్ డాక్యుమెంటేషన్ జారీ చేసే అధికారం కలిగి ఉంటాయి. ఆ తర్వాత విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి వీసా కోసం దరఖాస్తు చేస్తారు. వీటి ఆధారంగానే విద్యార్థులకు అమెరికాలో చదువుకోవటానికి వీలుగా వీసా జారీ అవుతుంది.

Next Story
Share it