Telugu Gateway
Top Stories

మెట్రో ఎక్కిన పెళ్లికూతురు

మెట్రో ఎక్కిన పెళ్లికూతురు
X

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఎందుకు అంటే గత కొంతకాలంగా దీనికి సంబదించిన వార్తలు మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బెంగళూరు లో చోటు చేసుకున్న ఘటన ఒకటి సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ట్రాఫిక్ సమస్యను తప్పించుకునేందుకు...ముహూర్తం టైం కు కల్యాణ మండపం చేరుకునేందుకు ఒక పెళ్లికూతురు మెట్రో రైల్ ఎక్కింది. పూర్తిగా రెడీ అయి..నగలు ధరించి కుటుంబ సభ్యులతో కలిసి ఆమె మెట్రోలో ప్రయాణించిన వీడియో ఒకటి ట్విట్టర్ లో హల్చల్ చేస్తోంది.

అంతే కాదు ఆ పెళ్లికూతురు వీడియో తీస్తున్న సమయంలో చేతులు ఊపుతూ హ్యాపీ గా ట్రైన్ ఎక్కింది. వాస్తవానికి ముందు ఆమె కార్ లో వెళ్ళటానికి రెడీ అయి బయలు దేరింది. కానీ ట్రాఫిక్ పరిస్థితి చూసి సకాలంలో చేరుకోవాలంటే ఇదే మార్గం అని మెట్రో ఎక్కింది. పరిస్థితిని పర్ఫెక్ట్ గా డీల్ చేసిన వధువుకు పెద్ద ఎత్తున అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది ఆమెను తెలివైన వధువు గా అభివర్ణిస్తున్నారు.

Next Story
Share it