ప్రపంచంలో ఖరీదైన నగరాలివే
జూలియస్ బేర్ గ్రూప్ తాజాగా ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరాల జాబితాను విడుదల చేసింది. ఈ నగరాల్లో నివసించటం అంటే భారీగానే చేతి చమురు వదుల్చుకోవాల్సి ఉంటుంది. అయితే అక్కడ ఉండేవారంతా కూడా సంపన్నులు అయితే ఉండగలుగుతారు. వివిధ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ జాబితా సిద్ధం చేశారు. ఈ సారి జాబితాలో షాంఘై నగరం మొదటి స్థానాన్ని ఆక్రమించగా.. ఆ తర్వాత రెండవ స్థానంలో లండన్ నిలిచింది.
ఆ తర్వాత స్థానాల్లో వరసగా తైపీ, హాంకాంగ్, సింగపూర్, మోనాకో, జ్యూరిచ్, టోక్యో నగరాలు నిలిచాయి. భారీ భారీ సంపన్నులు నివసించే ఈ నగరాల్లో గత ఏడాది కాలంగా పలు రకాల వస్తువుల ధరలు గణనీయంగా పెరిగాయి. నివాస సముదాయాల ధరలతోపాటు విమాన టిక్కెట్ ధరలు, కార్లు, బిజినెస్ స్కూల్స్ ఇలా ఒకటేమిటి ప్రతి ధరా పెరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు.